నే మింత విభునిఁ జేయనేరమమ్మ
(॥పల్లవి॥)
నే మింత విభునిఁ జేయనేరమమ్మ
వేమారు నీపె చేఁతలు వినరమ్మా
(॥నేమిం॥)
అట్టె వూడిగపుసతి నండఁ బెట్టు కొనివచ్చి
గట్టిగాఁ జీకటిలోనఁ గాఁగిలింపంచు
ఱట్టు సేసి కమ్మటి నాఱడికిఁ దానే కలయు
వట్టిపొందు కాపెనే వద్దఁ బండఁబెట్టును
(॥నేమిం॥)
అలుగు నాతని మొక్కు కాపెపాదాలు చాఁపించు
పలుకుఁ దా నాసతిచే బాగా లిప్పించు
అలయించి తొలుతనే ఆతనిఁ దా నొత్తి కూడి
వలపు లాకెచే మఱి వడి రేఁచఁజేను
(॥నేమిం॥)
అతనివేలివుంగరా లట్టె తాఁ బెట్టుకొని
పతిగా నాపెమట్టెలు పతి కందించు
యితవై శ్రీవేంకటేశు నిటువలెఁ దాఁ గూడే
మతకాన కాపెచేత మాటలాడింపించును
(||pallavi||)
ne miṁta vibhunim̐ jeyaneramamma
vemāru nībĕ sem̐talu vinarammā
(||nemiṁ||)
aṭṭĕ vūḍigabusadi naṁḍam̐ bĕṭṭu kŏnivachchi
gaṭṭigām̐ jīgaḍilonam̐ gām̐giliṁpaṁchu
ṟaṭṭu sesi kammaḍi nāṟaḍigim̐ dāne kalayu
vaṭṭibŏṁdu kābĕne vaddam̐ baṁḍam̐bĕṭṭunu
(||nemiṁ||)
alugu nādani mŏkku kābĕbādālu sām̐piṁchu
palugum̐ dā nāsadise bāgā lippiṁchu
alayiṁchi tŏludane ādanim̐ dā nŏtti kūḍi
valabu lāgĕse maṟi vaḍi rem̐sam̐jenu
(||nemiṁ||)
adanivelivuṁgarā laṭṭĕ tām̐ bĕṭṭugŏni
padigā nābĕmaṭṭĕlu padi kaṁdiṁchu
yidavai śhrīveṁkaḍeśhu niḍuvalĕm̐ dām̐ gūḍe
madagāna kābĕseda māḍalāḍiṁpiṁchunu