Ne mimdaagaa jeppidimi nelamtagu buddulellaa

నే మిందాకా జెప్పితిమి నెలఁతకు బుద్దులెల్లా
Language

(॥పల్లవి॥)
నే మిందాకా జెప్పితిమి నెలఁతకు బుద్దులెల్లా
కామించి మీఁదట నిఁక కందము నీ నేరుపు

(॥॥)
చింతతోడ నాకె నేఁడు చెక్కుచేతితో నున్నది
పంత మాడి యైన నీవు పరికించేవా
వింత నీసుద్దులు విని వెరగుతో నున్నది
యింతలో వంచినశిర సెత్తించేవా

(॥॥)
నియమపుఁ జలముతో నిట్లు చేసుక వున్నది
నయగారితనమున నవ్వించేవా
ప్రియముతోఁ బరపుపై బిగియుచుఁ దానున్నది
రయమున నీవద్దికి రప్పించేవా

(॥॥)
కడలేనియాసలతోఁ గాఁతాళాన నున్నది
తడఁబడక రతులఁ దనియించేవా
యెడయక శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడున్నది
వుడివోని నీ సత్యాల నొడఁబరచేవా

(||pallavi||)
ne miṁdāgā jĕppidimi nĕlam̐tagu buddulĕllā
kāmiṁchi mīm̐daḍa nim̐ka kaṁdamu nī nerubu

(||||)
siṁtadoḍa nāgĕ nem̐ḍu sĕkkusedido nunnadi
paṁta māḍi yaina nīvu parigiṁchevā
viṁta nīsuddulu vini vĕragudo nunnadi
yiṁtalo vaṁchinaśhira sĕttiṁchevā

(||||)
niyamabum̐ jalamudo niṭlu sesuga vunnadi
nayagāridanamuna navviṁchevā
priyamudom̐ barabubai bigiyusum̐ dānunnadi
rayamuna nīvaddigi rappiṁchevā

(||||)
kaḍaleniyāsaladom̐ gām̐tāḽāna nunnadi
taḍam̐baḍaga radulam̐ daniyiṁchevā
yĕḍayaga śhrī veṁkaḍeśha ninnum̐ gūḍunnadi
vuḍivoni nī satyāla nŏḍam̐barasevā