Ne middaramunu neebaalam jikkidi mide

నే మిద్దరమును నీపాలఁ జిక్కితి మిదె
Language

(॥పల్లవి॥)
నే మిద్దరమును నీపాలఁ జిక్కితి మిదె
కామించి యేపుణ్యమైనాఁ గట్టుకొనవయ్యా

(॥నేమి॥)
ఆకె నీకు నేరిపిన వవే తగవులు
లోకులము మమ్మునేల లోఁచి చూచేవు
సాకి రెవ్వరు చెప్పినా సటలే యందువు నీవు
వాకున వలచువారి వంకలాడవయ్యా

(॥నేమి॥)
చెవిలో నాడినమాటె చిత్తమునఁ బుట్టుఁగాక
వివరించి మమ్మునేల విచారించేవు
జవళిఁ జెలికత్తె ల సారెకు గరిసించేవు
భువిలోఁ గడవారికి పూనుకరావయ్యా

(॥నేమి॥)
ఇచ్చకములాడినవే ఇంపులు నీకౌఁగాక
అచ్చులము మమ్మునేల అలయించేవు
చెచ్చెర శ్రీవేంకటేశ చెనకి మమ్మేలితివి
మచ్చికైనవారినే మరగవయ్యా

(||pallavi||)
ne middaramunu nībālam̐ jikkidi midĕ
kāmiṁchi yebuṇyamainām̐ gaṭṭugŏnavayyā

(||nemi||)
āgĕ nīgu neribina vave tagavulu
logulamu mammunela lom̐si sūsevu
sāgi rĕvvaru sĕppinā saḍale yaṁduvu nīvu
vāguna valasuvāri vaṁkalāḍavayyā

(||nemi||)
sĕvilo nāḍinamāḍĕ sittamunam̐ buṭṭum̐gāga
vivariṁchi mammunela visāriṁchevu
javaḽim̐ jĕligattĕ la sārĕgu garisiṁchevu
bhuvilom̐ gaḍavārigi pūnugarāvayyā

(||nemi||)
ichchagamulāḍinave iṁpulu nīgaum̐gāga
achchulamu mammunela alayiṁchevu
sĕchchĕra śhrīveṁkaḍeśha sĕnagi mammelidivi
machchigainavārine maragavayyā