నే మెట్టుండితిమి నీ కేలయ్యా
(॥పల్లవి॥)
నే మెట్టుండితిమి నీ కేలయ్యా
దీమసాన నుండరాదా దీనత నీకేలయ్యా
(॥నేమె॥)
సెలవిఁబార నగుతాఁ జెలిదిక్కు చూచితేను
నిలిచి వుస్సురనేవు నీ కేలయ్యా
నలువుగాఁ బెదవిపై నాలో నే మాటడితేను
వెలవెలఁబారె మోము వింత నీ కేలయ్యా
(॥నేమె॥)
తడఁబడఁబేరుకొని తరుణులఁ బిలిచితే
నిడివి సిగ్గువడేవు నీ కేలాయ్యా
చిడుముడి నీచెక్కులచెమట నేఁ దుడిచితే
నొడఁబరచవచ్చేవు వులుకు నీ కేలయ్యా
(॥నేమె॥)
మెండుకొనఁ గాఁగిలించి మే నెల్ల నిమిరితే
నిండాఁ బులకించేవు నీ కేలయ్యా
కొండల శ్రీవేంకటేశ కూడితివి యింతలోన
పండుమోవితేనె దక్కె పంతము మా కేలయ్యా
(||pallavi||)
ne mĕṭṭuṁḍidimi nī kelayyā
dīmasāna nuṁḍarādā dīnada nīgelayyā
(||nemĕ||)
sĕlavim̐bāra nagudām̐ jĕlidikku sūsidenu
nilisi vussuranevu nī kelayyā
naluvugām̐ bĕdavibai nālo ne māḍaḍidenu
vĕlavĕlam̐bārĕ momu viṁta nī kelayyā
(||nemĕ||)
taḍam̐baḍam̐berugŏni taruṇulam̐ biliside
niḍivi sigguvaḍevu nī kelāyyā
siḍumuḍi nīsĕkkulasĕmaḍa nem̐ duḍiside
nŏḍam̐barasavachchevu vulugu nī kelayyā
(||nemĕ||)
mĕṁḍugŏnam̐ gām̐giliṁchi me nĕlla nimiride
niṁḍām̐ bulagiṁchevu nī kelayyā
kŏṁḍala śhrīveṁkaḍeśha kūḍidivi yiṁtalona
paṁḍumovidenĕ dakkĕ paṁtamu mā kelayyā