Ne meṟamgamu summee nilusumdi soose nitte

నే మెఱఁగము సుమ్మీ నిలుచుండి చూచే నిట్టే
Language

(॥పల్లవి॥)
నే మెఱఁగము సుమ్మీ నిలుచుండి చూచే నిట్టే
కోమలులకు నీకు గురుతాయ వలపులు

(॥నేమె॥)
వింత వింతమాటలు వేడుకతో పాటలు
దొంతులు వెట్టేరు నీపై తొయ్యలులెల్లా
చింత లనేవిరులు సిగ్గులనే సరులు
బంతి కట్టుగాఁగ నీపైఁ జల్లేరదివో

(॥నేమె॥)
కనుచూపు గురులు కొనగోరి గెరలు
పెనచేరు నీమీఁదఁ బ్రియురాండ్లు
చనుఁగవ కొండలు జంకెనల యండలు
ననుపులుగా నీపై నాటువేసే రదివో

(॥నేమె॥)
కాతరపు పొందులు కాఁగిటిలో విందులు
యేతులఁ జేసేరు నీకు యిల్లాండ్లు
యీతల శ్రీవేంకటేశ యిందరిఁ గూడితి విట్టె
పోతరముగా మీకు పోగువోసే రదివో

(||pallavi||)
ne mĕṟam̐gamu summī nilusuṁḍi sūse niṭṭe
komalulagu nīgu gurudāya valabulu

(||nemĕ||)
viṁta viṁtamāḍalu veḍugado pāḍalu
dŏṁtulu vĕṭṭeru nībai tŏyyalulĕllā
siṁta lanevirulu siggulane sarulu
baṁti kaṭṭugām̐ga nībaim̐ jalleradivo

(||nemĕ||)
kanusūbu gurulu kŏnagori gĕralu
pĕnaseru nīmīm̐dam̐ briyurāṁḍlu
sanum̐gava kŏṁḍalu jaṁkĕnala yaṁḍalu
nanubulugā nībai nāḍuvese radivo

(||nemĕ||)
kādarabu pŏṁdulu kām̐giḍilo viṁdulu
yedulam̐ jeseru nīgu yillāṁḍlu
yīdala śhrīveṁkaḍeśha yiṁdarim̐ gūḍidi viṭṭĕ
podaramugā mīgu poguvose radivo