నే మెఱఁగమా యేమే నీ సుద్దులు
(॥పల్లవి॥)
నే మెఱఁగమా యేమే నీ సుద్దులు
మా ముందరనే యెంత మాయలు సేసేవే
(॥నేమె॥)
బలిమిఁ గొంగువట్టితే పంతానకే పెనఁగేవు
చలమేల పతితోను సతులకును
తలంపులో వలపులు దట్టమైవుండఁగాను
వెలిబింకాలేల పెంచి వింతలు సేసేవే
(॥నేమె॥)
చెక్కు నొక్కి వేఁడుకొంటే సిగ్గులనే పొరలేవు
వెక్కసమింత యేఁటికే విభునితోను
పుక్కిట నీముచ్చటలు పురవురమనఁగాను
మొక్కలపు గుట్టుతోడ మోనమేల చూపేవే
(॥నేమె॥)
నంటునఁ గాఁగిలించితే నవ్వులే నవ్వేవు
వెంటనే వేసాలేల శ్రీవేంకటేశుతో
యింటనే యలమేల్మంగ వితనాలవై యుండఁగా
దంటతనముల నెంత తరితీపు సేసేవే
(||pallavi||)
ne mĕṟam̐gamā yeme nī suddulu
mā muṁdarane yĕṁta māyalu seseve
(||nemĕ||)
balimim̐ gŏṁguvaṭṭide paṁtānage pĕnam̐gevu
salamela padidonu sadulagunu
talaṁpulo valabulu daṭṭamaivuṁḍam̐gānu
vĕlibiṁkālela pĕṁchi viṁtalu seseve
(||nemĕ||)
sĕkku nŏkki vem̐ḍugŏṁṭe siggulane pŏralevu
vĕkkasamiṁta yem̐ṭige vibhunidonu
pukkiḍa nīmuchchaḍalu puravuramanam̐gānu
mŏkkalabu guṭṭudoḍa monamela sūbeve
(||nemĕ||)
naṁṭunam̐ gām̐giliṁchide navvule navvevu
vĕṁṭane vesālela śhrīveṁkaḍeśhudo
yiṁṭane yalamelmaṁga vidanālavai yuṁḍam̐gā
daṁṭadanamula nĕṁta taridību seseve