Ne meṟamgamaa adi neevu seppanemidigi

నే మెఱఁగమా అది నీవు చెప్పనేమిటికి
Language

(॥పల్లవి॥)
నే మెఱఁగమా అది నీవు చెప్పనేమిటికి
కాముకుఁడైనవాఁడవు కఱఁగఁగ నేరవా

(॥నేమెఱఁ॥)
వక్కణతో నాపెకు వలచినవాఁడవు
గక్కన నింతేసి పొగడనేరవా
చిక్కించుక సేవలెల్లాఁ జేయొంననవాఁడవు
మిక్కిలి నీ వాపెను మెచ్చనేరవా

(॥నేమెఱఁ॥)
కోరి వేఁడి యాపెఁ దెచ్చుకొనిన యట్టివాఁడవు
గారవించి మన్నించ మిక్కడ నేరవా
కారుకమ్మఁ బచ్చడము గప్పిన యట్టివాఁడవు
సారె సారె సిగ్గులెల జరపఁగ నేరవా

(॥నేమెఱఁ॥)
చలమున నాకెమోవి చవిగొన్నవాఁడవు
సొలసి సొలసి లోలోఁ జొకనేరవా
కలసితి విటు శ్రీవేంకటగిరీశ్వర నన్ను
తలఁచి ఇద్దిరిని సంతము సేయనేరవా

(||pallavi||)
ne mĕṟam̐gamā adi nīvu sĕppanemiḍigi
kāmugum̐ḍainavām̐ḍavu kaṟam̐gam̐ga neravā

(||nemĕṟam̐||)
vakkaṇado nābĕgu valasinavām̐ḍavu
gakkana niṁtesi pŏgaḍaneravā
sikkiṁchuga sevalĕllām̐ jeyŏṁnanavām̐ḍavu
mikkili nī vābĕnu mĕchchaneravā

(||nemĕṟam̐||)
kori vem̐ḍi yābĕm̐ dĕchchugŏnina yaṭṭivām̐ḍavu
gāraviṁchi manniṁcha mikkaḍa neravā
kārugammam̐ bachchaḍamu gappina yaṭṭivām̐ḍavu
sārĕ sārĕ siggulĕla jarabam̐ga neravā

(||nemĕṟam̐||)
salamuna nāgĕmovi savigŏnnavām̐ḍavu
sŏlasi sŏlasi lolom̐ jŏganeravā
kalasidi viḍu śhrīveṁkaḍagirīśhvara nannu
talam̐si iddirini saṁtamu seyaneravā