నే మెప్పుడూ నొకటే నెలఁతలము
(॥పల్లవి॥)
నే మెప్పుడూ నొకటే నెలఁతలము
నీ మసువస్తేఁ జూలు నాకు మేలే కా
(॥నేమె॥)
వోరుచుకోవే యని వొడఁబరచుకొంటాను
సారె బుద్దులు చెప్పేవు జాణవయ్యా
నేరుతువుగా యిందుకు ని న్నేమనేము నేము
కోరిననీకోరికలు కొనసాగెఁగా
(॥నేమె॥)
చేయి చేతఁబట్టుకొని చెక్కులు నొక్కుకొంటాను
చాయకుఁదెచ్చేవు మాఁట జాణవయ్యా
మాయదారివి తొల్లె మరినీకుఁజెప్పనేల
నీయుపాయము లెల్లాను నెరవేరెఁగా
(॥నేమె॥)
నన్నూ నాపెఁ గాఁగిలించి నవ్వులు నవ్వుకొంటాను
చన్ను లంటి కూడితివి జాణవయ్యా
యెన్ని విద్యలవాడవు యే మొక్కే శ్రీవేంకటేశ
సన్నల నీవేడుకలు సతమాయఁగా
(||pallavi||)
ne mĕppuḍū nŏgaḍe nĕlam̐talamu
nī masuvastem̐ jūlu nāgu mele kā
(||nemĕ||)
vorusugove yani vŏḍam̐barasugŏṁṭānu
sārĕ buddulu sĕppevu jāṇavayyā
neruduvugā yiṁdugu ni nnemanemu nemu
korinanīgorigalu kŏnasāgĕm̐gā
(||nemĕ||)
seyi sedam̐baṭṭugŏni sĕkkulu nŏkkugŏṁṭānu
sāyagum̐dĕchchevu mām̐ṭa jāṇavayyā
māyadārivi tŏllĕ marinīgum̐jĕppanela
nīyubāyamu lĕllānu nĕraverĕm̐gā
(||nemĕ||)
nannū nābĕm̐ gām̐giliṁchi navvulu navvugŏṁṭānu
sannu laṁṭi kūḍidivi jāṇavayyā
yĕnni vidyalavāḍavu ye mŏkke śhrīveṁkaḍeśha
sannala nīveḍugalu sadamāyam̐gā