Ne memisedume neevalane yimteshaaya

నే మేమిసేతుమే నీవలనే యింతేశాయ
Language

(॥పల్లవి॥)
నే మేమిసేతుమే నీవలనే యింతేశాయ
దోమటి వే సింగారాలు దొమ్మిసేసెఁ గదవే

(॥నేమే॥)
కూరిమిగొసరఁబోతే కొప్పు గడువెడజారె
సారెఁ గొప్పు వెట్టఁబోతే చన్నులు గానఁగవచ్చె
కోరి పయ్యదిడఁబోతే కుచ్చల వదలె నిదె
దారదప్పి జవ్వనమే తడఁబడీఁ గదవే

(॥నేమే॥)
సిగ్గులువడఁగఁబోతే సెలవినవ్వుల రేఁగె
సిగ్గులనవ్వు దాఁచితే నిట్టూర్పు రేఁగె
అగ్గపుటూర్పు లాఁగితే అలపులు గడునిండె
తగ్గన నీవలపులే తడఁబడీఁగదవే

(॥నేమే॥)
చేయి చాఁచఁబోతేను శ్రీవేంకటేశ్వరుఁ దాఁకె
కాయమంటి కాఁగిటనే కళలు రేఁగె
తోయపుటాకళలకు దొరకొనె వేడుకలు
చాయల నీచెనకులే సందడించీఁ గదవే

(||pallavi||)
ne memisedume nīvalane yiṁteśhāya
domaḍi ve siṁgārālu dŏmmisesĕm̐ gadave

(||neme||)
kūrimigŏsaram̐bode kŏppu gaḍuvĕḍajārĕ
sārĕm̐ gŏppu vĕṭṭam̐bode sannulu gānam̐gavachchĕ
kori payyadiḍam̐bode kuchchala vadalĕ nidĕ
dāradappi javvaname taḍam̐baḍīm̐ gadave

(||neme||)
sigguluvaḍam̐gam̐bode sĕlavinavvula rem̐gĕ
siggulanavvu dām̐side niṭṭūrbu rem̐gĕ
aggabuḍūrbu lām̐gide alabulu gaḍuniṁḍĕ
taggana nīvalabule taḍam̐baḍīm̐gadave

(||neme||)
seyi sām̐sam̐bodenu śhrīveṁkaḍeśhvarum̐ dām̐kĕ
kāyamaṁṭi kām̐giḍane kaḽalu rem̐gĕ
toyabuḍāgaḽalagu dŏragŏnĕ veḍugalu
sāyala nīsĕnagule saṁdaḍiṁchīm̐ gadave