నే మేమన్నా వెంగెమౌను నీ చిత్తము
(॥పల్లవి॥)
నే మేమన్నా వెంగెమౌను నీ చిత్తము
నీ మోహము ఆపె సొమ్ము నీ చిత్తము
(॥నేమే॥)
మక్కువ నాపెను నీవు మన్నింతువని నేను
నిక్కల గంటిని యిఁక నీ చిత్తము
చెక్కు చేతితో నిన్నే చింతించి నీ రాకలకు
నిక్కిచూచీఁ బలుమారు నీ చిత్తము
(॥నేమే॥)
గాఁటాన మీరిద్దరును కాలుదొక్కి పెండ్లాడఁగ
నీటు సకినములాయ నీచిత్తము
పాటించి లేకలు నీకుఁ బంపెఁ దన సఖులచే
నేఁటి వరుస సుద్దికి నీచిత్తము
(॥నేమే॥)
వచ్చితివి వాకిటికి వనిత లోన నున్నది
నిచ్చ పొంతనాలు గూడె నీ చిత్తము
పచ్చిగా శ్రీ వేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె
నెచ్చెలు లెల్లా మెచ్చిరి నీ చిత్తము
(||pallavi||)
ne memannā vĕṁgĕmaunu nī sittamu
nī mohamu ābĕ sŏmmu nī sittamu
(||neme||)
makkuva nābĕnu nīvu manniṁtuvani nenu
nikkala gaṁṭini yim̐ka nī sittamu
sĕkku sedido ninne siṁtiṁchi nī rāgalagu
nikkisūsīm̐ balumāru nī sittamu
(||neme||)
gām̐ṭāna mīriddarunu kāludŏkki pĕṁḍlāḍam̐ga
nīḍu saginamulāya nīsittamu
pāḍiṁchi legalu nīgum̐ baṁpĕm̐ dana sakhulase
nem̐ṭi varusa suddigi nīsittamu
(||neme||)
vachchidivi vāgiḍigi vanida lona nunnadi
nichcha pŏṁtanālu gūḍĕ nī sittamu
pachchigā śhrī veṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
nĕchchĕlu lĕllā mĕchchiri nī sittamu