నే మెటుల నుండినాను నీ కేమి
(॥పల్లవి॥)
నే మెటుల నుండినాను నీ కేమి
వేమరు మామీఁది ద్రిష్టి విడువవు నీవు
(॥నీ మెటుల॥)
సెలవి నే నగితేను చేరి య దేమిటి కంటా
నలరి చెప్పు మనుచు నాన వెట్టేపూ
తలఁకేవు నీ వ దేమి తప్పు నీవల్లఁ గలదా
తెలసుకో నీకు నీకే తేటతెల్ల మిఁకను
(॥నే మెటుల॥)
ముక్కుపై వే లిడుకొంటే ముంచి యేపని కనుచు
గుక్కక తెలుపు మని కొంగు వట్టేవు
మక్కువ నీవల్ల ననుమాన మైనఁ గలదా
చక్క నీవే దిద్దుకొమ్ము చల మేల యిఁకను
(॥నే మెటుల॥)
తప్పక నేఁ జూచితేను తమకించితి ననుచు
కప్పి కప్పి నన్ను నట్టె కాఁగిలించేవు
యిప్పుఢె శ్రీవెంకటేశ యెనసితి విటు నన్ను
అప్పటి కిప్పుడు నీవే అందము సేసుకొమ్మీ
(||pallavi||)
ne mĕḍula nuṁḍinānu nī kemi
vemaru māmīm̐di driṣhṭi viḍuvavu nīvu
(||nī mĕḍula||)
sĕlavi ne nagidenu seri ya demiḍi kaṁṭā
nalari sĕppu manusu nāna vĕṭṭebū
talam̐kevu nī va demi tappu nīvallam̐ galadā
tĕlasugo nīgu nīge teḍadĕlla mim̐kanu
(||ne mĕḍula||)
mukkubai ve liḍugŏṁṭe muṁchi yebani kanusu
gukkaga tĕlubu mani kŏṁgu vaṭṭevu
makkuva nīvalla nanumāna mainam̐ galadā
sakka nīve diddugŏmmu sala mela yim̐kanu
(||ne mĕḍula||)
tappaga nem̐ jūsidenu tamagiṁchidi nanusu
kappi kappi nannu naṭṭĕ kām̐giliṁchevu
yippuḍhĕ śhrīvĕṁkaḍeśha yĕnasidi viḍu nannu
appaḍi kippuḍu nīve aṁdamu sesugŏmmī