Ne mamta nerudumaa nerubulu tanadonu

నే మంత నేరుతుమా నేరుపులు తనతోను
Language

(॥పల్లవి॥)
నే మంత నేరుతుమా నేరుపులు తనతోను
గామిడి సతులయందే కనుఁగొను మనవే

(॥మంత॥)
బలిమిఁ జేసేపనులు పంతగత్తెలుఁగాక
కలుపుకోలు గులుగుకాంతలకేలే
చలము సాదించేది మచ్చరపు వారికిఁగాక
సులభులై యుండిన చుట్టాలకేలే

(॥మంత॥)
రా రాఁపుఁదనములు రవ్వలవారిఁగాక
సారె నోజగలిగిన సతులకేలే
బీరమలు నెరపేది బేసబెల్లులకుఁగాక
మేరతోఁ బెండ్లాడినమేనవారికేలే

(॥మంత॥)
అలయించి కూడేది గయ్యాళిమేంట్లకుఁగాక
వలచిన గుట్టుతోడి వనితకేలే
యెలమి శ్రీవేంకటేశుఁ డీతఁడిట్టె నన్ను నేలె
సొలపులు మావంటి సుదతులకేలే

(||pallavi||)
ne maṁta nerudumā nerubulu tanadonu
gāmiḍi sadulayaṁde kanum̐gŏnu manave

(||maṁta||)
balimim̐ jesebanulu paṁtagattĕlum̐gāga
kalubugolu gulugugāṁtalagele
salamu sādiṁchedi machcharabu vārigim̐gāga
sulabhulai yuṁḍina suṭṭālagele

(||maṁta||)
rā rām̐pum̐danamulu ravvalavārim̐gāga
sārĕ nojagaligina sadulagele
bīramalu nĕrabedi besabĕllulagum̐gāga
meradom̐ bĕṁḍlāḍinamenavārigele

(||maṁta||)
alayiṁchi kūḍedi gayyāḽimeṁṭlagum̐gāga
valasina guṭṭudoḍi vanidagele
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍiṭṭĕ nannu nelĕ
sŏlabulu māvaṁṭi sudadulagele