నే గడించినవి గావు నీ సుద్దులు
(॥పల్లవి॥)
నే గడించినవి గావు నీ సుద్దులు
వాగమై(?) నీవెంట వెంట వచ్చిన యీ సుద్దులు
(॥నేగడిం॥)
చేరి నే విన్నవించఁగా చిత్తము నొవ్వదుగదా
కోరి యిందరును నాడుకొన్న సుద్దులు
యీరీతి నేనే గడియించితి ననవు గదా
బోరన నూరిలో నెల్లాఁ బుట్టిన వీ సుద్దులు
(॥నేగడిం॥)
వెల్లివిరిసేయఁగానె వెంగెమై తోఁచదు గదా
చల్లిలమ్మేచోటి జాజరసుద్దులు
యెల్లవారికిని యిదె యెత్తిచ్చె ననవు గదా
కల్లరితనమున చీఁకటిలోని సుద్దులు
(॥నేగడిం॥)
అందరిలోన నిట్టే ఆయాలు సోఁకవు గదా
నందుని మందలలోని నంటుసుద్దులు
యిందుకే శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
నిందలే కావు గదా నిన్న మొన్న సుద్దులు
(||pallavi||)
ne gaḍiṁchinavi gāvu nī suddulu
vāgamai(?) nīvĕṁṭa vĕṁṭa vachchina yī suddulu
(||negaḍiṁ||)
seri ne vinnaviṁcham̐gā sittamu nŏvvadugadā
kori yiṁdarunu nāḍugŏnna suddulu
yīrīdi nene gaḍiyiṁchidi nanavu gadā
borana nūrilo nĕllām̐ buṭṭina vī suddulu
(||negaḍiṁ||)
vĕlliviriseyam̐gānĕ vĕṁgĕmai tom̐sadu gadā
sallilammesoḍi jājarasuddulu
yĕllavārigini yidĕ yĕttichchĕ nanavu gadā
kallaridanamuna sīm̐kaḍiloni suddulu
(||negaḍiṁ||)
aṁdarilona niṭṭe āyālu som̐kavu gadā
naṁduni maṁdalaloni naṁṭusuddulu
yiṁduge śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
niṁdale kāvu gadā ninna mŏnna suddulu