(॥పల్లవి॥)
నయమున నెంతయినా నవ్వవయ్యా
జయముగా నీకుఁ జేయిచాఁచితే నేమాయను
(॥నయ॥)
వేడుకై తేఁజాలు నీకు వేమారుఁబువ్వులను
వీడుపడకుండా నన్ను వేయవయ్యా
కోడెకాఁడవు మొదల కొమరెవయసుదాన
యీడనే పంతము నేను యిచ్చితే నేమాయన
(॥నయ॥)
చలము చెల్లితేఁజాలు సరుగఁ బన్నీటను
చలువగా వసంతము చల్లవయ్యా
బలిమికాఁడవు నీవు బత్తిగలదాన నేను
వొలిసి నీచేఁతలకు నోర్చితే నేమాయను
(॥నయ॥)
కావలసితేఁజాలు కాఁగిలించి నీవు నన్ను
యీవల నిన్నిటాను యేలవయ్యా
శ్రీవేంకటేశుఁడ నీవుచేకొన్నయాలను నేను
మోవరాని వలపుతో మొక్కితే నేమాయను
(||pallavi||)
nayamuna nĕṁtayinā navvavayyā
jayamugā nīgum̐ jeyisām̐side nemāyanu
(||naya||)
veḍugai tem̐jālu nīgu vemārum̐buvvulanu
vīḍubaḍaguṁḍā nannu veyavayyā
koḍĕgām̐ḍavu mŏdala kŏmarĕvayasudāna
yīḍane paṁtamu nenu yichchide nemāyana
(||naya||)
salamu sĕllidem̐jālu sarugam̐ bannīḍanu
saluvagā vasaṁtamu sallavayyā
balimigām̐ḍavu nīvu battigaladāna nenu
vŏlisi nīsem̐talagu norside nemāyanu
(||naya||)
kāvalasidem̐jālu kām̐giliṁchi nīvu nannu
yīvala ninniḍānu yelavayyā
śhrīveṁkaḍeśhum̐ḍa nīvusegŏnnayālanu nenu
movarāni valabudo mŏkkide nemāyanu