నయగారి సటకాఁడ నారసింహా నీ
(॥పల్లవి॥)
నయగారి సటకాఁడ నారసింహా నీ-
ప్రియమెల్లాఁ గంటి వింటి పెనునారసింహా
(॥నయ॥)
వేరేమారురూపై వెలనే వింతిమాటున
చేరి యేమిసేసితివో శ్రీనారసింహా
సారె నోరు దెరచేవు సతితమ్ములము నీకుఁ
గారమై తోఁచెనోకాక ఘననారసింహా
(॥నయ॥)
తీగెనవ్వు నవ్వేవు తెరవ నీమర్మమెత్తి
చేగదేర నేమనెనో శ్రీనారసింహా
వేగమే చెమరించేవు వెలఁదిదగ్గరనుండి
యేగతిఁ గళలంటెనో యిట నారసింహా
(॥నయ॥)
అంతలోనే బుసకొట్టే వంగనకాఁగిట నీవు
చెంత నెట్టు గూడితివో శ్రీనారసింహా
దొంతిగా శ్రీవేంకటాద్రిఁ దొడ నిఁతిఁ బెట్టుకొంటి
పంతమిచ్చితి అవుభళనారసింహా
(||pallavi||)
nayagāri saḍagām̐ḍa nārasiṁhā nī-
priyamĕllām̐ gaṁṭi viṁṭi pĕnunārasiṁhā
(||naya||)
veremārurūbai vĕlane viṁtimāḍuna
seri yemisesidivo śhrīnārasiṁhā
sārĕ noru dĕrasevu sadidammulamu nīgum̐
gāramai tom̐sĕnogāga ghananārasiṁhā
(||naya||)
tīgĕnavvu navvevu tĕrava nīmarmamĕtti
segadera nemanĕno śhrīnārasiṁhā
vegame sĕmariṁchevu vĕlam̐didaggaranuṁḍi
yegadim̐ gaḽalaṁṭĕno yiḍa nārasiṁhā
(||naya||)
aṁtalone busagŏṭṭe vaṁganagām̐giḍa nīvu
sĕṁta nĕṭṭu gūḍidivo śhrīnārasiṁhā
dŏṁtigā śhrīveṁkaḍādrim̐ dŏḍa nim̐tim̐ bĕṭṭugŏṁṭi
paṁtamichchidi avubhaḽanārasiṁhā