నయగారి నీ సుద్దులు నాకుఁ గొత్తలా
(॥పల్లవి॥)
నయగారి నీ సుద్దులు నాకుఁ గొత్తలా
ప్రియములన్నియు దాఁచి పెట్టెఁ బెట్టవయ్యా
(॥నయ॥)
మిక్కిలి నీవు మెచ్చఁగా మేనికి వెంగెమై తోఁచీ
దిక్కులవారు నవ్వేరంతేశాలయ్యా
చక్కెర యేదుగానైతే చవి మొగచాటు గాదా
వొక్కమారే యింతగద్దా వూరకుండవయ్యా
(॥నయ॥)
పూని సారెఁ బొగడఁగా పొందులకు వేఁగయ్యా
తేనె గారీఁ దీపుల నంతేశాలయ్యా
నూనె గొలచే కుంచము నునుపెక్కు మీఁద మీఁద
ఆనక మై దిగువారీనాయనాయనయ్యా
(॥నయ॥)
నగవులేదు గాఁగా నాము గడువేసీని
తెగరానిచోట్లు అంతేశాలయ్యా
పగటు శ్రీ వేంకటేశ పైకొంటివి కడపలో
అగపడె రతులు నీయాసలెంతేశయ్యా
(||pallavi||)
nayagāri nī suddulu nāgum̐ gŏttalā
priyamulanniyu dām̐si pĕṭṭĕm̐ bĕṭṭavayyā
(||naya||)
mikkili nīvu mĕchcham̐gā menigi vĕṁgĕmai tom̐sī
dikkulavāru navveraṁteśhālayyā
sakkĕra yedugānaide savi mŏgasāḍu gādā
vŏkkamāre yiṁtagaddā vūraguṁḍavayyā
(||naya||)
pūni sārĕm̐ bŏgaḍam̐gā pŏṁdulagu vem̐gayyā
tenĕ gārīm̐ dībula naṁteśhālayyā
nūnĕ gŏlase kuṁchamu nunubĕkku mīm̐da mīm̐da
ānaga mai diguvārīnāyanāyanayyā
(||naya||)
nagavuledu gām̐gā nāmu gaḍuvesīni
tĕgarānisoṭlu aṁteśhālayyā
pagaḍu śhrī veṁkaḍeśha paigŏṁṭivi kaḍabalo
agabaḍĕ radulu nīyāsalĕṁteśhayyā