నయ మిచ్చి మాటలాడ నా వంటిదా ఆపె
(॥పల్లవి॥)
నయ మిచ్చి మాటలాడ నా వంటిదా ఆపె
ప్రియముల బిగువులఁ బెనఁగెడుఁ గాక
(॥నయ॥)
గుట్టు దెలిసిన దాపె గొసరునా నిన్ను మరి
వట్టి సణఁగులు చల్లి వంచుఁ గాక
ఱట్టడి మొదలనె యాఱడి కింక లోఁగీనా
తిట్టులును దీవెనలు దిగఁబోసుఁ గాక
(॥నయ॥)
యింతచనవుల దాపె యిచ్చకము లాడీనా
పంతములనె నిన్నుఁ బంగించుఁ గాక
అంతేసి నేరిచినాపె అప్పణ నిన్నడిగీనా
వంతుల వాసులను మోవఁగఁ గూడుఁ గాక
(॥నయ॥)
మందెమేళముల దాపె మట్టున నుండునా నిన్నుఁ
గిందుపరచి తాఁ గరఁగించుఁ గాక
పొందితి శ్రీవెంకటేశ పొంచి నన్ను నిఁక నాపె
చందాలను చాయలను సమ్మతించుఁ గాక
(||pallavi||)
naya michchi māḍalāḍa nā vaṁṭidā ābĕ
priyamula biguvulam̐ bĕnam̐gĕḍum̐ gāga
(||naya||)
guṭṭu dĕlisina dābĕ gŏsarunā ninnu mari
vaṭṭi saṇam̐gulu salli vaṁchum̐ gāga
ṟaṭṭaḍi mŏdalanĕ yāṟaḍi kiṁka lom̐gīnā
tiṭṭulunu dīvĕnalu digam̐bosum̐ gāga
(||naya||)
yiṁtasanavula dābĕ yichchagamu lāḍīnā
paṁtamulanĕ ninnum̐ baṁgiṁchum̐ gāga
aṁtesi nerisinābĕ appaṇa ninnaḍigīnā
vaṁtula vāsulanu movam̐gam̐ gūḍum̐ gāga
(||naya||)
maṁdĕmeḽamula dābĕ maṭṭuna nuṁḍunā ninnum̐
giṁdubarasi tām̐ garam̐giṁchum̐ gāga
pŏṁdidi śhrīvĕṁkaḍeśha pŏṁchi nannu nim̐ka nābĕ
saṁdālanu sāyalanu sammadiṁchum̐ gāga