Navvuvachchee maagaide naamtagabu ninnum joosi

నవ్వువచ్చీ మాకైతే నాఁటకపు నిన్నుఁ జూచి
Language

(॥పల్లవి॥)
నవ్వువచ్చీ మాకైతే నాఁటకపు నిన్నుఁ జూచి
రవ్వలాయ నీ కతలు రాఁగా రాఁగాను

(॥నవ్వు॥)
రమణుఁడు వచ్చెనంటే రాగము కన్నుల నుబ్బె
కొమరె పొయపు సిగ్గే కొసరీఁగాని
కమలాక్షి నీ గుట్టు కంటిమి నేమింతలోనే
చెమరించె చెక్కు లింకాఁ జెప్పవేమే మాకు

(॥నవ్వు॥)
పతి యెలుఁగు వింటేనే వచ్చి దోఁచెఁ గళలెల్ల
కతకిరి మోనమేలో కదిమీ నిన్ను
సతి నీ వలపు మా యిచ్చటనె వెల్లవిరాయ
ఇతవై మై పులకించె నేల దాఁచే విపుడు

(॥నవ్వు॥)
అతఁడు దగ్గరితేనే ఆడితివి సరసము
కాతరాన నీకుచాలే కప్పేవుగాని
యేతరి శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁగూడె
యీతల నివ్వెరగైతి వెంతనేరుపరివే

(||pallavi||)
navvuvachchī māgaide nām̐ṭagabu ninnum̐ jūsi
ravvalāya nī kadalu rām̐gā rām̐gānu

(||navvu||)
ramaṇum̐ḍu vachchĕnaṁṭe rāgamu kannula nubbĕ
kŏmarĕ pŏyabu sigge kŏsarīm̐gāni
kamalākṣhi nī guṭṭu kaṁṭimi nemiṁtalone
sĕmariṁchĕ sĕkku liṁkām̐ jĕppaveme māgu

(||navvu||)
padi yĕlum̐gu viṁṭene vachchi dom̐sĕm̐ gaḽalĕlla
kadagiri monamelo kadimī ninnu
sadi nī valabu mā yichchaḍanĕ vĕllavirāya
idavai mai pulagiṁchĕ nela dām̐se vibuḍu

(||navvu||)
adam̐ḍu daggaridene āḍidivi sarasamu
kādarāna nīgusāle kappevugāni
yedari śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐gūḍĕ
yīdala nivvĕragaidi vĕṁtanerubarive