నవ్వునవ్వె రమణుఁడు ననుపుగాఁ బొందుసేసె
(॥పల్లవి॥)
నవ్వునవ్వె రమణుఁడు ననుపుగాఁ బొందుసేసె
రవ్వల నింతచాలదా రాతిరి రమ్మనవే
(॥నవ్వు॥)
చెక్కునొక్కె సేసవెట్టె చేయివేసె బుజముపై
జక్కవనాచన్ను లంటె చాలదా యింత
యెక్కువేది తక్కువేది యిప్పుడే కావలెనా
చుక్కకెదు రీవేళ చూచుక రమ్మనవే
(॥నవ్వు॥)
కాలుదొక్కె కాఁకరేఁచెఁ గన్నులఁ దప్పక చూచె
చౌలుగా మాఁటలూ నాడె చాలదా యింత
వేళలేదు పొద్దులేదు వేగిరించి నింతలోనే
యీలకూర కుప్పువేసే నిటుండి రమ్మనవే
(॥నవ్వు॥)
కొంగువట్టె గాఁగిలించెఁ గూడె సమరతులను
సంగతాయ నన్నిటాను చాలదా యింత
చెంగలించె నిన్నిటాను శ్రీవేంకటేశ్వరుఁడు
ముంగిట నున్నాఁడు యిట్టె మొక్కే రమ్మనవే
(||pallavi||)
navvunavvĕ ramaṇum̐ḍu nanubugām̐ bŏṁdusesĕ
ravvala niṁtasāladā rādiri rammanave
(||navvu||)
sĕkkunŏkkĕ sesavĕṭṭĕ seyivesĕ bujamubai
jakkavanāsannu laṁṭĕ sāladā yiṁta
yĕkkuvedi takkuvedi yippuḍe kāvalĕnā
sukkagĕdu rīveḽa sūsuga rammanave
(||navvu||)
kāludŏkkĕ kām̐karem̐sĕm̐ gannulam̐ dappaga sūsĕ
saulugā mām̐ṭalū nāḍĕ sāladā yiṁta
veḽaledu pŏdduledu vegiriṁchi niṁtalone
yīlagūra kuppuvese niḍuṁḍi rammanave
(||navvu||)
kŏṁguvaṭṭĕ gām̐giliṁchĕm̐ gūḍĕ samaradulanu
saṁgadāya nanniḍānu sāladā yiṁta
sĕṁgaliṁchĕ ninniḍānu śhrīveṁkaḍeśhvarum̐ḍu
muṁgiḍa nunnām̐ḍu yiṭṭĕ mŏkke rammanave