నవ్వులు నవ్వించవచ్చీ నగకున్నాను
(॥పల్లవి॥)
నవ్వులు నవ్వించవచ్చీ నగకున్నాను
యివ్వలఁ గతలు మానఁ డిఁకనన్నాను
(॥నవ్వు॥)
తన్నెవ్వారు దడవిరే తానేల మాటాడీనే
సన్నలుసేయఁగ వచ్చీఁ జాలునన్నాను
యెన్నోవినయాలు సేసీ యియ్యకొన్నవా రెవ్వరే
వున్నతిఁ బైఁజేయివేసీ నోపనన్నాను
(॥నవ్వు॥)
యిట్టె తానేడ నే నేడ యిచ్చకాలు సేసి సేసి
వట్టివావులు దెలిపీ వద్దన్నాను
చుట్టిచుట్టి మొక్కు మొక్కీఁ జూచినవా రెవ్వరే
నెట్టుకొని బాస సేసీ నిలువుమన్నాను
(॥నవ్వు॥)
కాదన్నవా రెవ్వరే కడుమోహములు చెప్పీ
సేదదేర మోవి చూపీ సిగ్గువడ్డాను
యీదెస శ్రీవేంకటేశుఁడిట్టె బలిమిఁ గూడె
గాదెఁ బోసీ బంతములు కైకొంటి నన్నాను
(||pallavi||)
navvulu navviṁchavachchī nagagunnānu
yivvalam̐ gadalu mānam̐ ḍim̐kanannānu
(||navvu||)
tannĕvvāru daḍavire tānela māḍāḍīne
sannaluseyam̐ga vachchīm̐ jālunannānu
yĕnnovinayālu sesī yiyyagŏnnavā rĕvvare
vunnadim̐ baim̐jeyivesī nobanannānu
(||navvu||)
yiṭṭĕ tāneḍa ne neḍa yichchagālu sesi sesi
vaṭṭivāvulu dĕlibī vaddannānu
suṭṭisuṭṭi mŏkku mŏkkīm̐ jūsinavā rĕvvare
nĕṭṭugŏni bāsa sesī niluvumannānu
(||navvu||)
kādannavā rĕvvare kaḍumohamulu sĕppī
sedadera movi sūbī sigguvaḍḍānu
yīdĕsa śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ balimim̐ gūḍĕ
gādĕm̐ bosī baṁtamulu kaigŏṁṭi nannānu