నవ్వుగాదు నీ చిత్తము నా భాగ్యము
(॥పల్లవి॥)
నవ్వుగాదు నీ చిత్తము నా భాగ్యము
దవ్వుల నిన్నుఁ గొసరఁదగవా నాకు
(॥॥)
జంకించితి బొమ్మలను సణఁగులు రాలించితి
మంకుఁదనమున నీతో మచ్చరించితి
యింక నీవు నన్ను నేఁడు యెట్టు లాలించేవోకాని
సంకెలేక నిన్ను దూర సంగతే నాకు
(॥॥)
కక్కసించి పిలిచితి గబ్బితనాలు చూపితి
చిక్కించుక కొనగోరఁ జెనకితిని
పక్కన నీవెట్లాను పాలించేవోకాని
వుక్కన బలిమిసేయ నుచితిమా నాకు
(॥॥)
చన్నుల నిన్ను నొత్తితి సమరతిఁ గూడితి
అన్నిటాను రతుల నిన్నలయించితి
యెన్నఁగ శ్రీ వేంకటేశ యెట్టు మెప్పించేవోకాని
నిన్ను వరుసలడుగ నేరుపా నాకు
(||pallavi||)
navvugādu nī sittamu nā bhāgyamu
davvula ninnum̐ gŏsaram̐dagavā nāgu
(||||)
jaṁkiṁchidi bŏmmalanu saṇam̐gulu rāliṁchidi
maṁkum̐danamuna nīdo machchariṁchidi
yiṁka nīvu nannu nem̐ḍu yĕṭṭu lāliṁchevogāni
saṁkĕlega ninnu dūra saṁgade nāgu
(||||)
kakkasiṁchi pilisidi gabbidanālu sūbidi
sikkiṁchuga kŏnagoram̐ jĕnagidini
pakkana nīvĕṭlānu pāliṁchevogāni
vukkana balimiseya nusidimā nāgu
(||||)
sannula ninnu nŏttidi samaradim̐ gūḍidi
anniḍānu radula ninnalayiṁchidi
yĕnnam̐ga śhrī veṁkaḍeśha yĕṭṭu mĕppiṁchevogāni
ninnu varusalaḍuga nerubā nāgu