Navvugaadu ne ninnu nammidim jummee

నవ్వుగాదు నే నిన్ను నమ్మితిఁ జుమ్మీ
Language

(॥పల్లవి॥)
నవ్వుగాదు నే నిన్ను నమ్మితిఁ జుమ్మీ
యివ్వల నా వెూవి లంచ మిచ్చితిఁ జుమ్మీ

(॥॥)
మంతనాన నీవాడినమాటలు మఱవకుమీ
కాంత లెందరైనా నీకుఁ గలవాఁడవు
వింతలేకుండా నిప్పుడే విన్నవించుకొంటి నేను
అంతలోనే ఇది బాస యడిగె ననకుమీ

(॥॥)
గట్టిగాబిగించుకొన్న నాకాఁగిలిఁ దలఁచుకొమ్మీ
గుట్టునఁ బెక్కుసతులఁ గూడేవాఁడవు
వొట్టి సేవలెల్లాఁ జేసి వొడఁబాటు సేసుకొంటి
నెట్టనే నిన్ను మీఁదుకట్టితి ననకుమీ

(॥॥)
పుక్కిటితమ్మ వెట్టినపొందు విడువకుమీ
మిక్కిలివనితలకు మేలువాఁడవు
నెక్కొని శ్రీవేంకటేశ నిన్ను నిందుకే కూడితి
చొక్కించి నాసొమ్ముగాఁ జేసుకొనె ననకుమీ

(||pallavi||)
navvugādu ne ninnu nammidim̐ jummī
yivvala nā vĕూvi laṁcha michchidim̐ jummī

(||||)
maṁtanāna nīvāḍinamāḍalu maṟavagumī
kāṁta lĕṁdarainā nīgum̐ galavām̐ḍavu
viṁtaleguṁḍā nippuḍe vinnaviṁchugŏṁṭi nenu
aṁtalone idi bāsa yaḍigĕ nanagumī

(||||)
gaṭṭigābigiṁchugŏnna nāgām̐gilim̐ dalam̐sugŏmmī
guṭṭunam̐ bĕkkusadulam̐ gūḍevām̐ḍavu
vŏṭṭi sevalĕllām̐ jesi vŏḍam̐bāḍu sesugŏṁṭi
nĕṭṭane ninnu mīm̐dugaṭṭidi nanagumī

(||||)
pukkiḍidamma vĕṭṭinabŏṁdu viḍuvagumī
mikkilivanidalagu meluvām̐ḍavu
nĕkkŏni śhrīveṁkaḍeśha ninnu niṁduge kūḍidi
sŏkkiṁchi nāsŏmmugām̐ jesugŏnĕ nanagumī