Navvudaane jolisese naaligaamdu

నవ్వుతానే జోలిసేసే నాలికాఁడు
Language

(॥పల్లవి॥)
నవ్వుతానే జోలిసేసే నాలికాఁడు
ఇవ్వల నేపొద్దూ నిట్టే యెచ్చరించవమ్మా

(॥నవ్వు॥)
అంటిఁగా ఆతని కెందరై నాఁగలరనుచు
వింటివా అప్పుడు నావిన్నపాలు
ఇంటికి నీవు విచ్చేసి ఇంకనైనా నాతని
గంటు వెట్టు కిందు దెచ్చి గడెవెట్టవమ్మా

(॥నవ్వు॥)
మొక్కితిఁగా ఆతని మొరఁగు లెరుఁగు మని
చిక్కితి వాతనిపాలఁ జేరి నీవు
గక్కనఁ గాఁగిటఁ బట్టి కరగించి యాతని
చెక్కు నొక్కి నీవే లోనుసేసుకొనవమ్మా

(॥నవ్వు॥)
సేసితిఁగా సన్న నీకు చేకొంటేఁ బోనియ్యఁ డని
బేసబెల్లితనమునఁ బెనఁగు మని
బాసతో శ్రీ వేంకటేపతి నీవు గూడితివి
మోసపోక యిన్నింటానే ముచ్చటా డవమ్మా

(||pallavi||)
navvudāne jolisese nāligām̐ḍu
ivvala nebŏddū niṭṭe yĕchchariṁchavammā

(||navvu||)
aṁṭim̐gā ādani kĕṁdarai nām̐galaranusu
viṁṭivā appuḍu nāvinnabālu
iṁṭigi nīvu vichchesi iṁkanainā nādani
gaṁṭu vĕṭṭu kiṁdu dĕchchi gaḍĕvĕṭṭavammā

(||navvu||)
mŏkkidim̐gā ādani mŏram̐gu lĕrum̐gu mani
sikkidi vādanibālam̐ jeri nīvu
gakkanam̐ gām̐giḍam̐ baṭṭi karagiṁchi yādani
sĕkku nŏkki nīve lonusesugŏnavammā

(||navvu||)
sesidim̐gā sanna nīgu segŏṁṭem̐ boniyyam̐ ḍani
besabĕllidanamunam̐ bĕnam̐gu mani
bāsado śhrī veṁkaḍebadi nīvu gūḍidivi
mosaboga yinniṁṭāne muchchaḍā ḍavammā