నవ్వుతా నేఁ దిట్టితేను నయ మిచ్చీనా
(॥పల్లవి॥)
నవ్వుతా నేఁ దిట్టితేను నయ మిచ్చీనా
జవ్వనపు చల్లజంపు చలమరివాఁడు
(॥నవ్వుతా॥)
మింగినచదువు వోతే మిట్టి మీ నై పడ్డవాఁడు
కుంగినకొండకుఁ దల గుట్టుకొన్నాఁడు
ముంగిట నొకసతిని మోరతోపు సేసినవాఁడు
సంగతిగ నీ పడుచుజగడాలవాఁడు
(॥నవ్వుతా॥)
అడిగెఁడు నేలకుఁ గా నాకస మంటినవాఁడు
గొడవకె తిరిగెటి కోపకాఁడు
అడరి వుత్తమురాలి నగ్గిబాస గొన్నవాఁడు
సడి బెట్టి మేనమామఁ జంపినవాఁడు
(॥నవ్వుతా॥)
చిల్లో యంటే పొల్లో యని సిగ్గు విడిచినవాఁడు
పెల్లు రేఁగి పరువులు పెట్టెడివాఁడు
యిల్లిదె శ్రీవెంకటాద్రి యెక్కి నన్నుఁ గూడె నేఁడు
బల్లిదుఁడై దేవతల పట్ట మేలేవాఁడు
(||pallavi||)
navvudā nem̐ diṭṭidenu naya michchīnā
javvanabu sallajaṁpu salamarivām̐ḍu
(||navvudā||)
miṁginasaduvu vode miṭṭi mī nai paḍḍavām̐ḍu
kuṁginagŏṁḍagum̐ dala guṭṭugŏnnām̐ḍu
muṁgiḍa nŏgasadini moradobu sesinavām̐ḍu
saṁgadiga nī paḍusujagaḍālavām̐ḍu
(||navvudā||)
aḍigĕm̐ḍu nelagum̐ gā nāgasa maṁṭinavām̐ḍu
gŏḍavagĕ tirigĕḍi kobagām̐ḍu
aḍari vuttamurāli naggibāsa gŏnnavām̐ḍu
saḍi bĕṭṭi menamāmam̐ jaṁpinavām̐ḍu
(||navvudā||)
sillo yaṁṭe pŏllo yani siggu viḍisinavām̐ḍu
pĕllu rem̐gi paruvulu pĕṭṭĕḍivām̐ḍu
yillidĕ śhrīvĕṁkaḍādri yĕkki nannum̐ gūḍĕ nem̐ḍu
ballidum̐ḍai devadala paṭṭa melevām̐ḍu