నవ్వినట్టివాఁడవు ఆనయమియ్య నేరవా
(॥పల్లవి॥)
నవ్వినట్టివాఁడవు ఆనయమియ్య నేరవా
జవ్వనభారముతో వేసరుకొనేఁగాక
(॥నవ్వి॥)
ఆస వుట్టించి వలపు లంతరేఁచినవాఁడవు
రాసికెక్క భోగించనేరవా నీవు
వీసమంతకోపముతో విరహతాపముతోడ
రాసేటికుచాతలతో రాయడించేఁగాక
(॥నవ్వి॥)
అనవెట్టి నిలిపి నాఅయాలంటినవాఁడవు
అనుక నన్నుమన్నించే దరుదా నీకు
సానఁబట్టేచూపులతో సళుపుఁ గాఁకలతోడ
తానకపుఘాతలతో తమకించేఁగాక
(॥నవ్వి॥)
అరతిఁ గాఁగిలించి అట్టెకూడినవాఁడవు
చేరి నాకు వినయాలు సేయనేరవా
యీరీతి శ్రీవేంకటేశ ఇంపుతోడ సొంపుతోడ
కోరికలు కొనసాగ కొరితిఁగాక
(||pallavi||)
navvinaṭṭivām̐ḍavu ānayamiyya neravā
javvanabhāramudo vesarugŏnem̐gāga
(||navvi||)
āsa vuṭṭiṁchi valabu laṁtarem̐sinavām̐ḍavu
rāsigĕkka bhogiṁchaneravā nīvu
vīsamaṁtagobamudo virahadābamudoḍa
rāseḍigusādalado rāyaḍiṁchem̐gāga
(||navvi||)
anavĕṭṭi nilibi nāayālaṁṭinavām̐ḍavu
anuga nannumanniṁche darudā nīgu
sānam̐baṭṭesūbulado saḽubum̐ gām̐kaladoḍa
tānagabughādalado tamagiṁchem̐gāga
(||navvi||)
aradim̐ gām̐giliṁchi aṭṭĕgūḍinavām̐ḍavu
seri nāgu vinayālu seyaneravā
yīrīdi śhrīveṁkaḍeśha iṁpudoḍa sŏṁpudoḍa
korigalu kŏnasāga kŏridim̐gāga