నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లఁడా
(॥పల్లవి॥)
నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లఁడా
యెవ్వ రేమనిరే నిన్ను నియ్యకొంటిఁ బదరా
(॥॥)
కానీవే గొల్లెతా కద్దులేరా గొల్లఁడా
ఔనా మఱవకువే అట్టే కానీరా
నే నేమంటిని నిన్ను నీకే తెలుసురా
మానితినే ఆమాట మంచిదాయఁ బదరా
(॥॥)
అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లఁడా
కదిసెఁ గడుపనులు కల్లగాదురా
ఇది నిక్కెమటవే ఇంతకంటె నటరా
పదరకువే నీవు పలుమారు నేలరా
(॥॥)
మెచ్చితినే గొల్లెతా మేలు లేరా గొల్లఁడా
కుచ్చితిఁ గాఁగిట నిన్నేఁ గూడుకొంటిరా
యిచ్చకుఁడ శ్రీ వేంకటేశుఁడను నేనే
యెచ్చరించవలెనా, యెఱుఁగుదుఁ బదరా
(||pallavi||)
navvidine gŏllĕdā nāya mavura gŏllam̐ḍā
yĕvva remanire ninnu niyyagŏṁṭim̐ badarā
(||||)
kānīve gŏllĕdā kaddulerā gŏllam̐ḍā
aunā maṟavaguve aṭṭe kānīrā
ne nemaṁṭini ninnu nīge tĕlusurā
mānidine āmāḍa maṁchidāyam̐ badarā
(||||)
adiyeme gŏllĕdā aṁdugerā gŏllam̐ḍā
kadisĕm̐ gaḍubanulu kallagādurā
idi nikkĕmaḍave iṁtagaṁṭĕ naḍarā
padaraguve nīvu palumāru nelarā
(||||)
mĕchchidine gŏllĕdā melu lerā gŏllam̐ḍā
kuchchidim̐ gām̐giḍa ninnem̐ gūḍugŏṁṭirā
yichchagum̐ḍa śhrī veṁkaḍeśhum̐ḍanu nene
yĕchchariṁchavalĕnā, yĕṟum̐gudum̐ badarā