Navvevu nee vappadini naadodanu

నవ్వేవు నీ వప్పటిని నాతోడను
Language

(॥పల్లవి॥)
నవ్వేవు నీ వప్పటిని నాతోడను
చివ్వన నే లోననుండి సిగ్గువడఁగాను

(॥నవ్వే॥)
చలము సాదించకురా జాణరాయ నీకు
మొలకచన్ను లనాఁడే మొక్కితి నేను
తిలకించి వొడివట్టి తీసేవేలరా నేను
తలుపు మాటున నిట్టే దాఁగి వుండఁగాను

(॥నవ్వే॥)
పంతాలు నెరపకురా ప్రాణనాథుఁడ నేను
ఇంతినై పట్టిననాఁడె యిరవైతిని
వింతగాఁ బువ్వుల బంతి వేసేవేలరా
కొంత పానుపు పై నొరగుచు నుండఁగాను

(॥నవ్వే॥)
వేగిరించకురా శ్రీ వేంకటేశుఁడ నీకు
ఈగతి వావైననాఁడే యెనసితిని
చేగదేరఁ గొనగోరఁ జిమ్మేవేలరా నీపై
నాగురుతులు చూచుక నవ్వు నవ్వఁగాను

(||pallavi||)
navvevu nī vappaḍini nādoḍanu
sivvana ne lonanuṁḍi sigguvaḍam̐gānu

(||navve||)
salamu sādiṁchagurā jāṇarāya nīgu
mŏlagasannu lanām̐ḍe mŏkkidi nenu
tilagiṁchi vŏḍivaṭṭi tīsevelarā nenu
talubu māḍuna niṭṭe dām̐gi vuṁḍam̐gānu

(||navve||)
paṁtālu nĕrabagurā prāṇanāthum̐ḍa nenu
iṁtinai paṭṭinanām̐ḍĕ yiravaidini
viṁtagām̐ buvvula baṁti vesevelarā
kŏṁta pānubu pai nŏragusu nuṁḍam̐gānu

(||navve||)
vegiriṁchagurā śhrī veṁkaḍeśhum̐ḍa nīgu
īgadi vāvainanām̐ḍe yĕnasidini
segaderam̐ gŏnagoram̐ jimmevelarā nībai
nāgurudulu sūsuga navvu navvam̐gānu