Navvevaari neṟamgavu nayamuna ninnum joosi

నవ్వేవారి నెఱఁగవు నయమున నిన్నుఁ జూచి
Language

(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నయమున నిన్నుఁ జూచి
నివ్వటిల్లిన దొరవు నీ వింతేసి సేతురా

(॥॥)
పువ్వులనేల వేసేవు బుజమేల గీరేవు
యెవ్వతె నీకు నేరిపె నిటువంటివి
చివ్వననూడిగాలు నా చేతఁ జేయింతురుగాక
అవ్వలివిడెము నీవే అంది నాకు నిత్తురా

(॥॥)
చన్నులేల పిసికేవు సారెనేల పెనఁగేవు
యిన్నేసి నీగజరుల కేమందును
వున్నతినీపాదాలు నావొడిపై వేతురుగాక
మిన్నక నీవుంగరము మెట్టెగాఁ బెట్టుదురా

(॥॥)
చెక్కులేల నొక్కేవు సిగ్గులేల తడవేవు
దిక్కుల నీవోజలెల్లాఁ దెలిసె నాకు
గక్కన శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
మెక్కించుకొందురుగాక మోము నాకు వంతురా

(||pallavi||)
navvevāri nĕṟam̐gavu nayamuna ninnum̐ jūsi
nivvaḍillina dŏravu nī viṁtesi sedurā

(||||)
puvvulanela vesevu bujamela gīrevu
yĕvvadĕ nīgu neribĕ niḍuvaṁṭivi
sivvananūḍigālu nā sedam̐ jeyiṁturugāga
avvaliviḍĕmu nīve aṁdi nāgu nitturā

(||||)
sannulela pisigevu sārĕnela pĕnam̐gevu
yinnesi nīgajarula kemaṁdunu
vunnadinībādālu nāvŏḍibai vedurugāga
minnaga nīvuṁgaramu mĕṭṭĕgām̐ bĕṭṭudurā

(||||)
sĕkkulela nŏkkevu siggulela taḍavevu
dikkula nīvojalĕllām̐ dĕlisĕ nāgu
gakkana śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
mĕkkiṁchugŏṁdurugāga momu nāgu vaṁturā