నవ్వేవారి నెఱఁగవు నలుదిక్కుల
(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నలుదిక్కుల
తవ్వించేవు జోలి నీవు తగునా యీ లాగులు
(॥నవ్వే॥)
యెంత చెప్పినా మాన వెగసక్కేలకు నీవు
అంతలోనే మొక్కించేవు ఆపెను నాకు
రంతుల నీకు విడువరానిచుట్టి మైతేను
వంతగత్తెలము మాకు పాడి యౌనా పనులు
(॥నవ్వే॥)
వొల్లనన్న విడువవు వొద్దఁ దెచ్చి పెట్టి యాపె
యెల్లగా సేవ సేయించే విప్పుడే మాకు
పెల్లుగా నీ కిట్టె యింటఁ బెట్టుకుండవలసితే
చెల్లునా సవతిపోరు చెప్పుమా యెఁదైనను
(॥నవ్వే॥)
ఆయనన్న తతిగొనే వాపెచే విడె మిప్పించి
చేయిఁ జేయిఁ బట్టి నీవే చెక్కు నొక్కేవు
యీయడ శ్రీవేంకటేశ యిద్దరి మమ్ముఁ గూడితి
పాయరానివార నింత వచ్చిసేయ వలెనా
(||pallavi||)
navvevāri nĕṟam̐gavu naludikkula
tavviṁchevu joli nīvu tagunā yī lāgulu
(||navve||)
yĕṁta sĕppinā māna vĕgasakkelagu nīvu
aṁtalone mŏkkiṁchevu ābĕnu nāgu
raṁtula nīgu viḍuvarānisuṭṭi maidenu
vaṁtagattĕlamu māgu pāḍi yaunā panulu
(||navve||)
vŏllananna viḍuvavu vŏddam̐ dĕchchi pĕṭṭi yābĕ
yĕllagā seva seyiṁche vippuḍe māgu
pĕllugā nī kiṭṭĕ yiṁṭam̐ bĕṭṭuguṁḍavalaside
sĕllunā savadiboru sĕppumā yĕm̐dainanu
(||navve||)
āyananna tadigŏne vābĕse viḍĕ mippiṁchi
seyim̐ jeyim̐ baṭṭi nīve sĕkku nŏkkevu
yīyaḍa śhrīveṁkaḍeśha yiddari mammum̐ gūḍidi
pāyarānivāra niṁta vachchiseya valĕnā