Navvevaari neṟamgavu naduma ninnu

నవ్వేవారి నెఱఁగవు నడుమ నిన్ను
Language

(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నడుమ నిన్ను
రవ్వచేసి యింతేసి రాజసము చూపేమా

(॥నవ్వే॥)
వాసులకే వచ్చేవు వంతులకే పెనఁగేవు
సేసవెట్టితినంటావే చెలఁగేవు
నీసరివారమేకామా నేమెల్లా నాతనికి
ఆ సుద్దు లందరితోడా నాడుకోనేమా

(॥నవ్వే॥)
దగ్గరఁ గూచుండేవు దంటమాట లాడేవు
యెగ్గు సిగ్గులు నెంచక యెదరించేవు
కగ్గని సవతులముకామా నీకు నేఁడు
వెగ్గళించి పంతములు వెదచల్లేమా

(॥నవ్వే॥)
చేవమీరఁ జూచేవు చిరునవ్వు నవ్వేవు
కావరించీతనిఁ గూడి కడు మించేవు
శ్రీవేంకటేశుఁ డీతఁడు చెనకుచు మమ్ము నేలె
యీవేళ మేనరికాన యెమ్మె చూపేమా

(||pallavi||)
navvevāri nĕṟam̐gavu naḍuma ninnu
ravvasesi yiṁtesi rājasamu sūbemā

(||navve||)
vāsulage vachchevu vaṁtulage pĕnam̐gevu
sesavĕṭṭidinaṁṭāve sĕlam̐gevu
nīsarivāramegāmā nemĕllā nādanigi
ā suddu laṁdaridoḍā nāḍugonemā

(||navve||)
daggaram̐ gūsuṁḍevu daṁṭamāḍa lāḍevu
yĕggu siggulu nĕṁchaga yĕdariṁchevu
kaggani savadulamugāmā nīgu nem̐ḍu
vĕggaḽiṁchi paṁtamulu vĕdasallemā

(||navve||)
sevamīram̐ jūsevu sirunavvu navvevu
kāvariṁchīdanim̐ gūḍi kaḍu miṁchevu
śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍu sĕnagusu mammu nelĕ
yīveḽa menarigāna yĕmmĕ sūbemā