Navvevaari neṟamgavu naduma neevu

నవ్వేవారి నెఱఁగవు నడుమ నీవు
Language

(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నడుమ నీవు
రవ్వ సేసుకొనకువే రమణులలోనను

(॥నవ్వే॥)
చనువు గలితేఁ బతిసరుసఁ గూచుండవే
ఘనముగా మన్నించితే కాలు దొక్కవే
పెనఁగులాడ నొపితే పిరిదూరి చెనకవే
యెనసి యాతోనేల యీడు వెట్టుకొనేవు

(॥నవ్వే॥)
వయసు మిక్కుటమైతే వడిగాఁ గొసరవే
నయగారాలు నేర్చితే నమ్మించేకోవే
ప్రియము నీకైతేను పెదవి తేనె లానవే
నియతాన మాతోపొత్తు వీవేల కలసేవు

(॥నవ్వే॥)
వలచితే నాతనికి వావిచెప్పి వేఁడుకోవే
కలయ వేడుకైతే గక్కన మొక్కవే
అలమేలుమంగను నే నతఁడు శ్రీవేంకటేశుఁ
డెలమి నన్నేలె నిఁక నిచ్చకమేమాడేవు

(||pallavi||)
navvevāri nĕṟam̐gavu naḍuma nīvu
ravva sesugŏnaguve ramaṇulalonanu

(||navve||)
sanuvu galidem̐ badisarusam̐ gūsuṁḍave
ghanamugā manniṁchide kālu dŏkkave
pĕnam̐gulāḍa nŏbide piridūri sĕnagave
yĕnasi yādonela yīḍu vĕṭṭugŏnevu

(||navve||)
vayasu mikkuḍamaide vaḍigām̐ gŏsarave
nayagārālu nerside nammiṁchegove
priyamu nīgaidenu pĕdavi tenĕ lānave
niyadāna mādobŏttu vīvela kalasevu

(||navve||)
valaside nādanigi vāvisĕppi vem̐ḍugove
kalaya veḍugaide gakkana mŏkkave
alamelumaṁganu ne nadam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍĕlami nannelĕ nim̐ka nichchagamemāḍevu