నవ్వేవారి నెఱఁగవు నాలుగువంకల నిన్ను
(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నాలుగువంకల నిన్ను
జవ్వన మదముననే సాముసేసేవు
(॥నవ్వే॥)
యెంతైనా గద్దునీయాసయేమి చెప్పే దిందరిలో
కాంతవలపులకు గాదె నీమేను
చెంత నాకుచములు చేతులనే పట్టుకొని
మంతులెక్క నాపెతోను మాఁటలాడేవు
(॥నవ్వే॥)
తలఁచరాదు నీరతి తమకివి యిన్నిటాను
జలజాక్షులెంగిలికంచము నీమోవి
అలరి యధరామృత మందుకొంటా నాపెపొత్తు
కలసి సన్నలుసేసి కాఁకరేఁచేవు
(॥నవ్వే॥)
పట్టరాదు నీవయసు పడఁతుల కెల్ల రచ్చ
కొట్టమాయ నిదివో నీగొప్పవురము
నెట్టన శ్రీవేంకటేశ నీవునన్నుఁ గూడి యట్టె
కట్టుకొంటి వాపెపదకము నీమెడను
(||pallavi||)
navvevāri nĕṟam̐gavu nāluguvaṁkala ninnu
javvana madamunane sāmusesevu
(||navve||)
yĕṁtainā gaddunīyāsayemi sĕppe diṁdarilo
kāṁtavalabulagu gādĕ nīmenu
sĕṁta nāgusamulu sedulane paṭṭugŏni
maṁtulĕkka nābĕdonu mām̐ṭalāḍevu
(||navve||)
talam̐sarādu nīradi tamagivi yinniḍānu
jalajākṣhulĕṁgiligaṁchamu nīmovi
alari yadharāmṛta maṁdugŏṁṭā nābĕbŏttu
kalasi sannalusesi kām̐karem̐sevu
(||navve||)
paṭṭarādu nīvayasu paḍam̐tula kĕlla rachcha
kŏṭṭamāya nidivo nīgŏppavuramu
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvunannum̐ gūḍi yaṭṭĕ
kaṭṭugŏṁṭi vābĕbadagamu nīmĕḍanu