నవ్వేవారి నెఱఁగవు నాలుగుదిక్కులా నుండి
(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నాలుగుదిక్కులా నుండి
యివ్వల వాసి వద్దా ఇంతిరో నీకు
(॥నవ్వే॥)
సెలవి నవ్వులు నవ్వి చేసన్నలు సేసి
కలువపువ్వుల వేసి కాతరించేవు
వలవనిపతిమీఁద వట్టి బత్తి సేయఁగాను
కలిగినదేమే యిందు కాంతరో నీకు
(॥నవ్వే॥)
ఆయములు గోర నంటి ఆరజపుమాట లాడి
కాయము చేత నిమిరి గరిసించేవు
చాయాకాని కింతలేసిచవులు పుట్టించబోతే
ఆయెడ నేమీ లాభము అతివరో నీకు
(॥నవ్వే॥)
కప్పరపు విడె మిచ్చి కాగిటిలో రతిఁ గూడె
చిప్పిల శ్రీవేంకటేశుఁ జిమ్మిరేఁచేవు
అప్పుడే నన్ను నేలె ఆతనిపైఁ గొసరఁగా
చెప్పవే కూడినదేమి చెలియరో నీకు
(||pallavi||)
navvevāri nĕṟam̐gavu nālugudikkulā nuṁḍi
yivvala vāsi vaddā iṁtiro nīgu
(||navve||)
sĕlavi navvulu navvi sesannalu sesi
kaluvabuvvula vesi kādariṁchevu
valavanibadimīm̐da vaṭṭi batti seyam̐gānu
kaliginademe yiṁdu kāṁtaro nīgu
(||navve||)
āyamulu gora naṁṭi ārajabumāḍa lāḍi
kāyamu seda nimiri garisiṁchevu
sāyāgāni kiṁtalesisavulu puṭṭiṁchabode
āyĕḍa nemī lābhamu adivaro nīgu
(||navve||)
kapparabu viḍĕ michchi kāgiḍilo radim̐ gūḍĕ
sippila śhrīveṁkaḍeśhum̐ jimmirem̐sevu
appuḍe nannu nelĕ ādanibaim̐ gŏsaram̐gā
sĕppave kūḍinademi sĕliyaro nīgu