నవ్వేవారి నెఱఁగవు నాతిరో నీవు
(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగవు నాతిరో నీవు
పువ్వువంటి సిగ్గు దెచ్చి పొల్లు సేయవలదే
(॥నవ్వే॥)
హత్తి నేనూ నాతఁడు నంటి సరసమాడఁగా
పొత్తుగలయవచ్చేవు పొసఁగునటే
కొత్తగాఁ గన్నకలలు కోరి నేము చెప్పుకోఁగా
వొత్తి యర్థా లడిగేవు వుండఁబట్ట దటవే
(॥నవ్వే॥)
జాడతో నిద్దరము సేసలు చల్లుకొనఁగాను
తోడఁ బెండ్లాడ వచ్చేవు దొరసునటే
నీడల చక్కఁదనాలు నే మద్దములోఁ జూడఁగా
ఆడ నీ మొగము చూపే వమరునటే
(॥నవ్వే॥)
తేరకొన మాలో నేము తెరవేసుకుండఁగాను
పోర చెడుగ వచ్చేవు పొద్దువోదటే
యీరీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటా న న్నేలఁగాను
నేరిపేవు రతు లోతనికిఁ దగునటవే
(||pallavi||)
navvevāri nĕṟam̐gavu nādiro nīvu
puvvuvaṁṭi siggu dĕchchi pŏllu seyavalade
(||navve||)
hatti nenū nādam̐ḍu naṁṭi sarasamāḍam̐gā
pŏttugalayavachchevu pŏsam̐gunaḍe
kŏttagām̐ gannagalalu kori nemu sĕppugom̐gā
vŏtti yardhā laḍigevu vuṁḍam̐baṭṭa daḍave
(||navve||)
jāḍado niddaramu sesalu sallugŏnam̐gānu
toḍam̐ bĕṁḍlāḍa vachchevu dŏrasunaḍe
nīḍala sakkam̐danālu ne maddamulom̐ jūḍam̐gā
āḍa nī mŏgamu sūbe vamarunaḍe
(||navve||)
teragŏna mālo nemu tĕravesuguṁḍam̐gānu
pora sĕḍuga vachchevu pŏdduvodaḍe
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā na nnelam̐gānu
neribevu radu lodanigim̐ dagunaḍave