Navvevaari neṟamgamdu naluvamkam dannum joosi

నవ్వేవారి నెఱఁగఁడు నలువంకఁ దన్నుఁ జూచి
Language

(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగఁడు నలువంకఁ దన్నుఁ జూచి
దివ్వెలెత్తుఁ బొద్దుకాడ తివిరీ నిదేఁటికే

(॥నవ్వే॥)
చెక్కులవెంటాను పెంజెమటలు గారఁగాను
యెక్కడనుండి వచ్చెనే ఇప్పుడితఁడు
పుక్కిటిబంటియైన బుసకొట్ల తోడుత
మక్కళించి యెటువంటి మాట లాడీనే

(॥నవ్వే॥)
విరులు కొప్పుననుండి విడి విడి రాలఁగాను
బిరుదుతో తా నెంత పెనఁగాడీనే
గరిమతో నిద్దురలు కన్నులనే తేరఁగాను
పరగ పాన్పుపై నెట్టు పవళించీనే

(॥నవ్వే॥)
అలపులు తనమేన నటు తొట్రు కొనఁగాను
పిలిచి కాఁగిట నెంత బిగియించీనే
యెలిమి శ్రీ వేంకటేశుఁడీతఁడే తా నన్నుఁ గూడె
కొలువులోపల నెంత కొనియాడీనే

(||pallavi||)
navvevāri nĕṟam̐gam̐ḍu naluvaṁkam̐ dannum̐ jūsi
divvĕlĕttum̐ bŏddugāḍa tivirī nidem̐ṭige

(||navve||)
sĕkkulavĕṁṭānu pĕṁjĕmaḍalu gāram̐gānu
yĕkkaḍanuṁḍi vachchĕne ippuḍidam̐ḍu
pukkiḍibaṁṭiyaina busagŏṭla toḍuda
makkaḽiṁchi yĕḍuvaṁṭi māḍa lāḍīne

(||navve||)
virulu kŏppunanuṁḍi viḍi viḍi rālam̐gānu
birududo tā nĕṁta pĕnam̐gāḍīne
garimado nidduralu kannulane teram̐gānu
paraga pānpubai nĕṭṭu pavaḽiṁchīne

(||navve||)
alabulu tanamena naḍu tŏṭru kŏnam̐gānu
pilisi kām̐giḍa nĕṁta bigiyiṁchīne
yĕlimi śhrī veṁkaḍeśhum̐ḍīdam̐ḍe tā nannum̐ gūḍĕ
kŏluvulobala nĕṁta kŏniyāḍīne