నవ్వేవారి నెఱఁగదు నడుమఁ దనచేఁతకు
(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగదు నడుమఁ దనచేఁతకు
అవ్వలనుండే తాను ఆససేసీ నీకు
(॥నవ్వే॥)
వుడివోని వలపులు వుట్టి గట్టుక వున్నది
దడి గట్టుక సిగ్గులు దాఁచుకున్నది
పెడరేఁచి వినయాలు పేరబెట్టుక వున్నది
అడియాలా లన్నియును నందుకొనవయ్యా
(॥నవ్వే॥)
మించుఁ గనుచూపులు మీఁ దెత్తుక వున్నది
పొంచి ప్రియములు రాశివోసుకున్నది
కంచపు మోవి యట్టె కానుక వట్టుకున్నది
అంచెలఁ జేతులు చాఁచి అందుకొనవయ్యా
(॥నవ్వే॥)
ముసి ముసి నవ్వులు మూటగట్టుక వున్నది
కొసరు మాఁటలు గూర్చుకొని వున్నది
యెసఁగి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
‘అసమున’ నాపె పోర చెందుకొనవయ్యా
(||pallavi||)
navvevāri nĕṟam̐gadu naḍumam̐ danasem̐tagu
avvalanuṁḍe tānu āsasesī nīgu
(||navve||)
vuḍivoni valabulu vuṭṭi gaṭṭuga vunnadi
daḍi gaṭṭuga siggulu dām̐sugunnadi
pĕḍarem̐si vinayālu perabĕṭṭuga vunnadi
aḍiyālā lanniyunu naṁdugŏnavayyā
(||navve||)
miṁchum̐ ganusūbulu mīm̐ dĕttuga vunnadi
pŏṁchi priyamulu rāśhivosugunnadi
kaṁchabu movi yaṭṭĕ kānuga vaṭṭugunnadi
aṁchĕlam̐ jedulu sām̐si aṁdugŏnavayyā
(||navve||)
musi musi navvulu mūḍagaṭṭuga vunnadi
kŏsaru mām̐ṭalu gūrsugŏni vunnadi
yĕsam̐gi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
‘asamuna’ nābĕ pora sĕṁdugŏnavayyā