Navvevaari neṟamgadu nadumam daanu

నవ్వేవారి నెఱఁగదు నడుమఁ దాను
Language

(॥పల్లవి॥)
నవ్వేవారి నెఱఁగదు నడుమఁ దాను
నివ్వటిల నీ వెన్నినేర్పితివో చేఁతలు

(॥॥)
చెలరేఁగి చెలరేఁగి చేసీ నీకు విన్నపాలు
నలనాక్షి నీకెంతచనవోకాని
చలివాసి నీ యెదుట సన్నలెల్లాఁ జేసీని
యెలమి నీవెంతసలి గిచ్చితివో యిపుడు

(॥॥)
కొసరి కొసరి నీకుఁగొలువులు సేసీని
సుసరాన నీకె యెంత చుట్టమోకాని
యెసగి నీకప్పటిని యిచ్చకములే సేసీని
వసమై యెంతవలచి వచ్చితివో యిపుడు

(॥॥)
చిమ్మరేఁగి చిమ్మిరేఁగి నేసవెట్టీ నిన్నుఁ గూడి
యెమ్మెలఁ దానెంత నీకు నింపుదోకాని
నెమ్మది శ్రీ వేంకటేశ నీవు నను నేలితివి
చిమ్ముల నాపె కెట్లాఁ జెప్పితివో యిపుడు

(||pallavi||)
navvevāri nĕṟam̐gadu naḍumam̐ dānu
nivvaḍila nī vĕnninerbidivo sem̐talu

(||||)
sĕlarem̐gi sĕlarem̐gi sesī nīgu vinnabālu
nalanākṣhi nīgĕṁtasanavogāni
salivāsi nī yĕduḍa sannalĕllām̐ jesīni
yĕlami nīvĕṁtasali gichchidivo yibuḍu

(||||)
kŏsari kŏsari nīgum̐gŏluvulu sesīni
susarāna nīgĕ yĕṁta suṭṭamogāni
yĕsagi nīgappaḍini yichchagamule sesīni
vasamai yĕṁtavalasi vachchidivo yibuḍu

(||||)
simmarem̐gi simmirem̐gi nesavĕṭṭī ninnum̐ gūḍi
yĕmmĕlam̐ dānĕṁta nīgu niṁpudogāni
nĕmmadi śhrī veṁkaḍeśha nīvu nanu nelidivi
simmula nābĕ kĕṭlām̐ jĕppidivo yibuḍu