(॥పల్లవి॥)
నవ్వీ నూరక నాతోను వలపులు
తవ్వీ నిదివో తనలోనే తాను
(॥నవ్వీ॥)
యేఁటిఁకి జెనకీ నీతఁడు మాఁటికి-
మాఁటికి నాకుఁదా మరిగెనట
గాటపు నా గుబ్బలు గదలించి పైపై
నేఁటలు వేసీ నిది యేయే తాను
(॥నవ్వీ॥)
విసరీ సురటి నాకు వీఁడిదివో నేడు
కొరి కొసరి తొల్లి కూడెనట
పసలుగా నా మోవి పండు గడుఁ దీపంటా
అసురుసురై మేలము లాడీఁ దాను
(॥నవ్వీ॥)
యెలమి నాతోఁ జెప్పె నిదియేలే రతి-
నలమి యలమి తా నలసె నట
తెలిపె శ్రీవేంకటాద్రి దేవుఁడఁ దానంటా నా-
అలపులు దీర్చీనంటుచుఁ దాను
(||pallavi||)
navvī nūraga nādonu valabulu
tavvī nidivo tanalone tānu
(||navvī||)
yem̐ṭim̐ki jĕnagī nīdam̐ḍu mām̐ṭigi-
mām̐ṭigi nāgum̐dā marigĕnaḍa
gāḍabu nā gubbalu gadaliṁchi paibai
nem̐ṭalu vesī nidi yeye tānu
(||navvī||)
visarī suraḍi nāgu vīm̐ḍidivo neḍu
kŏri kŏsari tŏlli kūḍĕnaḍa
pasalugā nā movi paṁḍu gaḍum̐ dībaṁṭā
asurusurai melamu lāḍīm̐ dānu
(||navvī||)
yĕlami nādom̐ jĕppĕ nidiyele radi-
nalami yalami tā nalasĕ naḍa
tĕlibĕ śhrīveṁkaḍādri devum̐ḍam̐ dānaṁṭā nā-
alabulu dīrsīnaṁṭusum̐ dānu