నవ్వే దెఱఁగఁడు నడుమంత్రములవారు
(॥పల్లవి॥)
నవ్వే దెఱఁగఁడు నడుమంత్రములవారు
చివ్వనఁ దనలోన సిగ్గువడవలదా
(॥నవ్వే॥)
రాకాఁబోకల రమణుఁడు దూరీనే! తా
జోక సన్న సేయఁగాను చూడనంటా
పోకుంటేఁ బిలిచి బొమ్మల జంకించీనే! యింత-
కాకు గలదా కాంతలలోన
(॥నవ్వే॥)
బలిమీఁ జలిమీఁ బతి యేల యలిగీనే! తా-
నలసి నిద్రించ లేపనై తినంటా
పలికి పలికి పలువెంగేలాడీనే! నే
వెలికి వచ్చితినంటా వేగిరమా తనకు
(॥నవ్వే॥)
తగిలి తగిలి తానేల మొక్కీనే! నే
జిగిఁ గూడి చెప్పినట్టు సేసితినంటా
చిగులుతా మెచ్చీ శ్రీవేంకటేశ్వరుఁడె నేఁ
దగ నుర మెక్కితిని తా జాణఁగదవే
(||pallavi||)
navve dĕṟam̐gam̐ḍu naḍumaṁtramulavāru
sivvanam̐ danalona sigguvaḍavaladā
(||navve||)
rāgām̐bogala ramaṇum̐ḍu dūrīne! tā
joga sanna seyam̐gānu sūḍanaṁṭā
poguṁṭem̐ bilisi bŏmmala jaṁkiṁchīne! yiṁta-
kāgu galadā kāṁtalalona
(||navve||)
balimīm̐ jalimīm̐ badi yela yaligīne! tā-
nalasi nidriṁcha lebanai tinaṁṭā
paligi paligi paluvĕṁgelāḍīne! ne
vĕligi vachchidinaṁṭā vegiramā tanagu
(||navve||)
tagili tagili tānela mŏkkīne! ne
jigim̐ gūḍi sĕppinaṭṭu sesidinaṁṭā
siguludā mĕchchī śhrīveṁkaḍeśhvarum̐ḍĕ nem̐
daga nura mĕkkidini tā jāṇam̐gadave