నవ్వవే యెక్కడిసుద్ది నయముగా నతనితో
(॥పల్లవి॥)
నవ్వవే యెక్కడిసుద్ది నయముగా నతనితో
రవ్వలు చేసుకొంటేను రాఁపుకెక్కదా
(॥నవ్వవే॥)
సరసములాడఁగానే చనవులెల్లఁ బుట్టుఁ గాక
యెరవులు చేసుకొంటే నెనసుండునా
మరిగి వుండఁగానే మనసులెనసుఁ గాక
వొరటులు చూపితేను వొడఁబాటు గలదా
(॥నవ్వవే॥)
ఇచ్చకాలు సేయఁగానే ఇంపులు రేఁగుఁగాక
మచ్చరానఁ బెనఁగితే మట్టుపడునా
మచ్చికలు చూపఁగానే మర్మములు సోఁకుఁగాక
పచ్చిగాఁ గాఁతాళించితే భావాలు గరఁగునా
(॥నవ్వవే॥)
చుట్టిరికాన మించితే సులభమౌఁగాక మేలు
ఱట్టులు చేసుకొంటే మఱఁగుసేయవచ్చునా
ఇట్టే శ్రీవేంకటేశుఁ డెనసెఁ దానే నిన్ను
గుట్టులు చూపకుండితే కొంకు దేరునా
(||pallavi||)
navvave yĕkkaḍisuddi nayamugā nadanido
ravvalu sesugŏṁṭenu rām̐pugĕkkadā
(||navvave||)
sarasamulāḍam̐gāne sanavulĕllam̐ buṭṭum̐ gāga
yĕravulu sesugŏṁṭe nĕnasuṁḍunā
marigi vuṁḍam̐gāne manasulĕnasum̐ gāga
vŏraḍulu sūbidenu vŏḍam̐bāḍu galadā
(||navvave||)
ichchagālu seyam̐gāne iṁpulu rem̐gum̐gāga
machcharānam̐ bĕnam̐gide maṭṭubaḍunā
machchigalu sūbam̐gāne marmamulu som̐kum̐gāga
pachchigām̐ gām̐tāḽiṁchide bhāvālu garam̐gunā
(||navvave||)
suṭṭirigāna miṁchide sulabhamaum̐gāga melu
ṟaṭṭulu sesugŏṁṭe maṟam̐guseyavachchunā
iṭṭe śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕm̐ dāne ninnu
guṭṭulu sūbaguṁḍide kŏṁku derunā