Navvave selavulanu namtudodanu

నవ్వవే సెలవులను నంటుతోడను
Language

(॥పల్లవి॥)
నవ్వవే సెలవులను నంటుతోడను
చివ్వనఁ దమకమునఁ జిమి(మ్మి?)రేఁగీ నితఁడు

(॥॥)
రంతు సేసి పతిని నేరము లెంతురటవే
అంతరంగమెఱిఁగినయాఁటదానవు
వింతదానవా నీవు విడె మందుకొనవే
దొంతరప్రియములెల్లా దొరలించీ నితఁడు

(॥॥)
బలిమిని మగరాని బాసగొందురటవే
అలరినచుట్టరికపాఁటదానవు
లలిఁ బోరచిదానవా లాచి దండఁ గూచుండవే
వెలలేని వేడుకలు వెదవెట్టీ నితఁడు

(॥॥)
శ్రీ వేంకటేశ్వరుని సిగ్గువరతురటవే
ఆవటించి కాఁగిటిలో ఆఁటదానవు
వావి నెరవులదానవా మోవి చవిచూపవే
చేవమీర వేఁడుకొని చెక్కునొక్కీ నితఁడు

(||pallavi||)
navvave sĕlavulanu naṁṭudoḍanu
sivvanam̐ damagamunam̐ jimi(mmi?)rem̐gī nidam̐ḍu

(||||)
raṁtu sesi padini neramu lĕṁturaḍave
aṁtaraṁgamĕṟim̐ginayām̐ṭadānavu
viṁtadānavā nīvu viḍĕ maṁdugŏnave
dŏṁtarapriyamulĕllā dŏraliṁchī nidam̐ḍu

(||||)
balimini magarāni bāsagŏṁduraḍave
alarinasuṭṭarigabām̐ṭadānavu
lalim̐ borasidānavā lāsi daṁḍam̐ gūsuṁḍave
vĕlaleni veḍugalu vĕdavĕṭṭī nidam̐ḍu

(||||)
śhrī veṁkaḍeśhvaruni sigguvaraduraḍave
āvaḍiṁchi kām̐giḍilo ām̐ṭadānavu
vāvi nĕravuladānavā movi savisūbave
sevamīra vem̐ḍugŏni sĕkkunŏkkī nidam̐ḍu