నవ్వవద్దా నాకు నాకే నాయకుఁడ నిన్నుఁ జూచి
(॥పల్లవి॥)
నవ్వవద్దా నాకు నాకే నాయకుఁడ నిన్నుఁ జూచి
నవ్వులే కేరడములై నాఁటుకొనీఁ గాకా
(॥నవ్వ॥)
మెచ్చవద్దా నీ మేని మించుఁ జెమటలు చూచి
మెచ్చఁబోతే వెంగెములై మెఱసీఁ గాకా
కుచ్చవద్దా కౌఁగిట నీ కుంకుమ చెక్కులు చూచి
కుచ్చిన నీ కిది నీకుఁ గోపమయ్యీ గాకా
(॥నవ్వ॥)
తిద్దవద్దా నీ కురులు దిమ్ముఁజెదరులు చూచి
తిద్దఁబోతే మోము సిగ్గుదేరీఁ గాకా
వొద్దనఁగా వలదా వుస్సురసురులు చూచి
వొద్దంటే నీకు నది వొచ్చమయ్యీఁ గాకా
(॥నవ్వ॥)
మొక్కవద్దా నీవు సేసేమొరఁగు రతుల కెల్లా
మొక్కితేనే మర్మములు ముట్టీఁ గాకా
చెక్కు నొక్క వలదా శ్రీవేంకటేశ నా
చెక్కు ముట్టితే మఱపు చిమ్మిరేఁగీఁ గాకా
(||pallavi||)
navvavaddā nāgu nāge nāyagum̐ḍa ninnum̐ jūsi
navvule keraḍamulai nām̐ṭugŏnīm̐ gāgā
(||navva||)
mĕchchavaddā nī meni miṁchum̐ jĕmaḍalu sūsi
mĕchcham̐bode vĕṁgĕmulai mĕṟasīm̐ gāgā
kuchchavaddā kaum̐giḍa nī kuṁkuma sĕkkulu sūsi
kuchchina nī kidi nīgum̐ gobamayyī gāgā
(||navva||)
tiddavaddā nī kurulu dimmum̐jĕdarulu sūsi
tiddam̐bode momu sigguderīm̐ gāgā
vŏddanam̐gā valadā vussurasurulu sūsi
vŏddaṁṭe nīgu nadi vŏchchamayyīm̐ gāgā
(||navva||)
mŏkkavaddā nīvu sesemŏram̐gu radula kĕllā
mŏkkidene marmamulu muṭṭīm̐ gāgā
sĕkku nŏkka valadā śhrīveṁkaḍeśha nā
sĕkku muṭṭide maṟabu simmirem̐gīm̐ gāgā