(॥పల్లవి॥)
నవ్వకురా నీ నటనలను । నీ-
జవ్వన మందే చక్కనయ్యీఁ గాని
(॥నవ్వ॥)
మఱవకురా నీమాటలు యీ-
జఱపులలోనే సరిచూపేను
వొఱగకురా సారె వొఱపులనుః తెర-
మఱఁగుల మొఱఁగుల మంచిదయ్యీఁగాని
(॥నవ్వ॥)
చిమ్మకురా చూపు చివుకనను నీ-
దిమ్ముఁగాఁకలనే తెలిపేను
కమ్మకురా నీగర్వము యివి
కమ్మర నీరతిఁ గందముగాని
(॥నవ్వ॥)
బిగియకురా కడుఁబ్రియమునను యీ-
బిగువుఁగాగిటనే పెనచేను
తగు శ్రీవేంకటధరణీశ నన్ను
మిగులఁ గూడితి విది మెచ్చేఁగాని
(||pallavi||)
navvagurā nī naḍanalanu | nī-
javvana maṁde sakkanayyīm̐ gāni
(||navva||)
maṟavagurā nīmāḍalu yī-
jaṟabulalone sarisūbenu
vŏṟagagurā sārĕ vŏṟabulanuḥ tĕra-
maṟam̐gula mŏṟam̐gula maṁchidayyīm̐gāni
(||navva||)
simmagurā sūbu sivugananu nī-
dimmum̐gām̐kalane tĕlibenu
kammagurā nīgarvamu yivi
kammara nīradim̐ gaṁdamugāni
(||navva||)
bigiyagurā kaḍum̐briyamunanu yī-
biguvum̐gāgiḍane pĕnasenu
tagu śhrīveṁkaḍadharaṇīśha nannu
migulam̐ gūḍidi vidi mĕchchem̐gāni