నవ్వ నీకుఁ జెల్లు నట నాకుఁ గొసరఁ జెల్లదా
(॥పల్లవి॥)
నవ్వ నీకుఁ జెల్లు నట నాకుఁ గొసరఁ జెల్లదా
రవ్వగాఁ దడవుదురా రాజసపు వాఁడవు
(॥నవ్వ॥)
సిగ్గుపడి వున్నమమ్ముఁ జేయి వట్టి తియ్య నేల
యెగ్గు వట్టె వేల నే నే మన్నాను
అగ్గల మై సరసము లాడ నేర్చినవాఁడ
వొగ్గి అన్ని మాటలనును వోరుచుకో నేరవా
(॥నవ్వ॥)
జగడించి యున్నదాని చన్ను లంటి చూడ నేల
తగవులఁ బెట్ట నేల తల మంటెను
చిగులుతా మమ్ము నింత నేయ నేర్చినవాఁడవు
యెగసక్కెపు మాకోపా లిముడుకోఁ జాలవా
(॥నవ్వ॥)
కన్ను మూసుకున్నదాని కాఁగిలించి పట్ట నేల
చిన్నఁ బోవ నేల నాచే దాఁకె నంటా
యెన్నికెతో శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
నిన్ను నన్ను నెంచుకొని నిండుకుండ నేరవా
(||pallavi||)
navva nīgum̐ jĕllu naḍa nāgum̐ gŏsaram̐ jĕlladā
ravvagām̐ daḍavudurā rājasabu vām̐ḍavu
(||navva||)
siggubaḍi vunnamammum̐ jeyi vaṭṭi tiyya nela
yĕggu vaṭṭĕ vela ne ne mannānu
aggala mai sarasamu lāḍa nersinavām̐ḍa
vŏggi anni māḍalanunu vorusugo neravā
(||navva||)
jagaḍiṁchi yunnadāni sannu laṁṭi sūḍa nela
tagavulam̐ bĕṭṭa nela tala maṁṭĕnu
siguludā mammu niṁta neya nersinavām̐ḍavu
yĕgasakkĕbu māgobā limuḍugom̐ jālavā
(||navva||)
kannu mūsugunnadāni kām̐giliṁchi paṭṭa nela
sinnam̐ bova nela nāse dām̐kĕ naṁṭā
yĕnnigĕdo śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
ninnu nannu nĕṁchugŏni niṁḍuguṁḍa neravā