(॥పల్లవి॥)
నవరసముల దీనళినాక్షి
జవకట్టి నీకుఁ జవి సేసీని
(॥నవ॥)
శృంగారరసము చెలియమొకంబున
సంగతి వీరరసము గోళ్ళ
రంగగు కరుణారము పెదవులను
అంగపుఁ గుచముల నద్భుతరసము
(॥నవ॥)
చెలి హస్యరసము సెలవుల నిండీ
పలుచని నడుమున భయరసము
కలికి వాడుఁగన్నుల బీభత్సము
అలబొమ జంకెన నదె రౌద్రంబు
(॥నవ॥)
సతిరతిమరపుల శాంతరసంబదె
అతిమోహము పదియవరసము
ఇతవుగ శ్రీ వెంకటేశ కూడితివి
సతమై యీపెకుసంతోసరసము
(||pallavi||)
navarasamula dīnaḽinākṣhi
javagaṭṭi nīgum̐ javi sesīni
(||nava||)
śhṛṁgārarasamu sĕliyamŏgaṁbuna
saṁgadi vīrarasamu goḽḽa
raṁgagu karuṇāramu pĕdavulanu
aṁgabum̐ gusamula nadbhudarasamu
(||nava||)
sĕli hasyarasamu sĕlavula niṁḍī
palusani naḍumuna bhayarasamu
kaligi vāḍum̐gannula bībhatsamu
alabŏma jaṁkĕna nadĕ raudraṁbu
(||nava||)
sadiradimarabula śhāṁtarasaṁbadĕ
adimohamu padiyavarasamu
idavuga śhrī vĕṁkaḍeśha kūḍidivi
sadamai yībĕgusaṁtosarasamu