ననుఁబోటిగాఁ గా నాతో నవ్వేఁ గాక
(॥పల్లవి॥)
ననుఁబోటిగాఁ గా నాతో నవ్వేఁ గాక
గునిసే యాఁట దైతే గుంపించ కుండునా
(॥ననుబోటి॥)
తక్కక నేను నిన్ను తప్పు లెంచఁ జాలఁ గాక
నిక్కపు నీవొళ్లితప్పు నీ వెఱఁగనా
చెక్కు నొక్కి చెలు లెల్లాఁ జెప్పఁగానె వింటిఁ గాక
వెక్కసపుటాఁట దైతే విడనాడ కుండునా
(॥ననుఁబోటి॥)
కావరించి నిన్నుఁ దారుకాణఁ బెట్టఁ జాలఁ గాక
నీ వాడినమాఁటలు నీ వెఱఁగవా
మోవ నాడి యిందరూను మొక్కఁగానె వింటిఁ గాక
చేవ దేరి నాఁట దైతే చిమ్మి రేఁచ కుండునా
(॥ననుఁబోటి॥)
కలసినమీఁద నీతోఁ గపటాలు నేరఁగాక
నిలువు నీకుచ్చితాలు నీ వెరఁగవా
చెలఁగి కూడితి విట్టె శ్రీవెంకటేశ నన్ను
అలిగినయాఁట దైతే నలయించ కుండునా
(||pallavi||)
nanum̐boḍigām̐ gā nādo navvem̐ gāga
gunise yām̐ṭa daide guṁpiṁcha kuṁḍunā
(||nanuboḍi||)
takkaga nenu ninnu tappu lĕṁcham̐ jālam̐ gāga
nikkabu nīvŏḽlidappu nī vĕṟam̐ganā
sĕkku nŏkki sĕlu lĕllām̐ jĕppam̐gānĕ viṁṭim̐ gāga
vĕkkasabuḍām̐ṭa daide viḍanāḍa kuṁḍunā
(||nanum̐boḍi||)
kāvariṁchi ninnum̐ dārugāṇam̐ bĕṭṭam̐ jālam̐ gāga
nī vāḍinamām̐ṭalu nī vĕṟam̐gavā
mova nāḍi yiṁdarūnu mŏkkam̐gānĕ viṁṭim̐ gāga
seva deri nām̐ṭa daide simmi rem̐sa kuṁḍunā
(||nanum̐boḍi||)
kalasinamīm̐da nīdom̐ gabaḍālu neram̐gāga
niluvu nīguchchidālu nī vĕram̐gavā
sĕlam̐gi kūḍidi viṭṭĕ śhrīvĕṁkaḍeśha nannu
aliginayām̐ṭa daide nalayiṁcha kuṁḍunā