ననుఁ జూచి యిప్పు డెంతనవ్వు నవ్వేవు నీ
(॥పల్లవి॥)
ననుఁ జూచి యిప్పు డెంతనవ్వు నవ్వేవు నీ-
వనితనై వున్నదాన వలదనేనా
(॥॥)
చెలిమికాఁడ నీవేల సిగ్గుపడేవు యేమో
వెలఁది విన్నవించీని వినరాదా
యెలమి నామోము చూచి యేల లోఁగేవు మీకుఁ-
గలసాజమే యిది కాదనేనా
(॥॥)
కోడెకాఁడనీవేల గుట్టు సేసేవు ఆపె
తోడనే కానుకిచ్చీ నందుకొనరాదా
వేడుక నేఁ జూచేఁగాక వెఱవనేలా మీ-
వాడికమోహము లివి వారించేనా
(॥॥)
శ్రీవేంకటేశుఁడ యెంతచెలరేఁగేవు నీ-
దేవులు సన్నలు సేసీఁ దెలియరాదా
గోవిందరాజవు నీవే గుఱుతుగంటి యిదే
యీవల నన్నేలితివి యీకె యేలనేనా
(||pallavi||)
nanum̐ jūsi yippu ḍĕṁtanavvu navvevu nī-
vanidanai vunnadāna valadanenā
(||||)
sĕlimigām̐ḍa nīvela siggubaḍevu yemo
vĕlam̐di vinnaviṁchīni vinarādā
yĕlami nāmomu sūsi yela lom̐gevu mīgum̐-
galasājame yidi kādanenā
(||||)
koḍĕgām̐ḍanīvela guṭṭu sesevu ābĕ
toḍane kānugichchī naṁdugŏnarādā
veḍuga nem̐ jūsem̐gāga vĕṟavanelā mī-
vāḍigamohamu livi vāriṁchenā
(||||)
śhrīveṁkaḍeśhum̐ḍa yĕṁtasĕlarem̐gevu nī-
devulu sannalu sesīm̐ dĕliyarādā
goviṁdarājavu nīve guṟudugaṁṭi yide
yīvala nannelidivi yīgĕ yelanenā