Nanum joosi hari neevu navvagumdevaa

ననుఁ జూచి హరి నీవు నవ్వకుండేవా
Language

(॥పల్లవి॥)
ననుఁ జూచి హరి నీవు నవ్వకుండేవా
పనిమాలెంత బయలుపాఁకీ నామనసు

(॥ననుఁ॥)
మనసుకు గోచరమా మాటలకు గోచరమా
కనుఁగొన వసమా నీఘనరూపము
నిను వెదకుచున్నాఁడ నీవెక్కడ నే నెక్కడ
జనుఁడ నింతె యెంత సాహసము నాది

(॥ననుఁ॥)
వున్నచో టెఱుఁగుదునా వోయీ అంటేఁ బలికేవా
యెన్ని తెలియఁ దరమా యిట్టి నీమాయ
అన్నిటా నీకొలువుసేయఁ గడఁగుచున్నవాఁడ
యెన్నటిపొందు నీవు నాకెంత దిట్టతనమో

(॥ననుఁ॥)
వాకిలి గానవచ్చునా వంచించి చొరవచ్చునా
రాకపోక కబ్బునా పరమపదము
శ్రీకాంతుఁడ ప్రత్యక్షమై శ్రీవేంకటాద్రి యిదె
కైకొంటి నీకృప నెంత గట్టువాయతనమో

(||pallavi||)
nanum̐ jūsi hari nīvu navvaguṁḍevā
panimālĕṁta bayalubām̐kī nāmanasu

(||nanum̐||)
manasugu gosaramā māḍalagu gosaramā
kanum̐gŏna vasamā nīghanarūbamu
ninu vĕdagusunnām̐ḍa nīvĕkkaḍa ne nĕkkaḍa
janum̐ḍa niṁtĕ yĕṁta sāhasamu nādi

(||nanum̐||)
vunnaso ṭĕṟum̐gudunā voyī aṁṭem̐ baligevā
yĕnni tĕliyam̐ daramā yiṭṭi nīmāya
anniḍā nīgŏluvuseyam̐ gaḍam̐gusunnavām̐ḍa
yĕnnaḍibŏṁdu nīvu nāgĕṁta diṭṭadanamo

(||nanum̐||)
vāgili gānavachchunā vaṁchiṁchi sŏravachchunā
rāgaboga kabbunā paramabadamu
śhrīgāṁtum̐ḍa pratyakṣhamai śhrīveṁkaḍādri yidĕ
kaigŏṁṭi nīkṛpa nĕṁta gaṭṭuvāyadanamo