Nanum joodave imkanu naa sommu sesugonenu

ననుఁ జూడవే ఇఁకను నా సొమ్ము చేసుకొనేను
Language

(॥పల్లవి॥)
ననుఁ జూడవే ఇఁకను నా సొమ్ము చేసుకొనేను
ఘనుఁ డీతనిచెయ్యి నేఁ గైదండ చేకొంటిని

(॥॥)
చనవరిదానవు చలమరిదానవు
యెనలే కాతనిఁ గూడ కేల మానేవే
మనసునమ్మినయట్టిమాటపట్టు వుచ్చుకొంటి-
వినుమడించె వలపు లిట్టుండవలదా

(॥॥)
ఇతవరిదానవు ఇయ్యకొన్న దానవు
రతుల నింటికి నేల రాకుండేవే
సతముగా నన్నిటా సమ్మతి చేసుకొంటివి
బలుకు నీవలె నిట్టె పచరించవలదా

(॥॥)
పాయరానదానవు పంతగారిదానవు
చాయల నేపోన్దూనేల జంటవాసేవే
రేయి వచ్చి శ్రీ వేంకటాద్రిగోవిందుఁడే నన్నేలె
యీయెడ నవ్వునవ్వితి వింత మెచ్చవలదా

(||pallavi||)
nanum̐ jūḍave im̐kanu nā sŏmmu sesugŏnenu
ghanum̐ ḍīdanisĕyyi nem̐ gaidaṁḍa segŏṁṭini

(||||)
sanavaridānavu salamaridānavu
yĕnale kādanim̐ gūḍa kela māneve
manasunamminayaṭṭimāḍabaṭṭu vuchchugŏṁṭi-
vinumaḍiṁchĕ valabu liṭṭuṁḍavaladā

(||||)
idavaridānavu iyyagŏnna dānavu
radula niṁṭigi nela rāguṁḍeve
sadamugā nanniḍā sammadi sesugŏṁṭivi
balugu nīvalĕ niṭṭĕ pasariṁchavaladā

(||||)
pāyarānadānavu paṁtagāridānavu
sāyala nebondūnela jaṁṭavāseve
reyi vachchi śhrī veṁkaḍādrigoviṁdum̐ḍe nannelĕ
yīyĕḍa navvunavvidi viṁta mĕchchavaladā