Nanum delubam gadave naaraayana nee mahima

ననుఁ దెలుపఁ గదవే నారాయణ నీ మహిమ
Language

(॥పల్లవి॥)
ననుఁ దెలుపఁ గదవే నారాయణ నీ మహిమ
జనయంతి యని చాటుచునున్నది

(॥నను॥)
తలపోసి చూడ మొదలఁ బ్రకృతి జడము
యెలమితో గుణత్రయ మేల వచ్చెను
మలసి యందరికిని మనసై నిలువ నేలఁ
యిల నింద్రియవ్యాపార మేమిటికి

(॥నను॥)
ప్రకృతి జడమైతే బహుభాష లు రా నేల
అకట సంసారభోగ మది గా నేల
ప్రకటించి బ్రహ్మదులపట్టము గానేల
సకలధర్మాధర్మస్వరూప మెట్టాయ

(॥నను॥)
జడమైన ప్రకృతికి జన్మపరంపర లేల
అడియాలాలందు నందు నదెట్టెఱిఁగె
యెడ చొచ్చీని ప్రేరణ లన్నిటానని యెంచితే
విడివి శ్రీవేంకటేశ నీవు నిష్క్రియుఁడవు

(||pallavi||)
nanum̐ dĕlubam̐ gadave nārāyaṇa nī mahima
janayaṁti yani sāḍusununnadi

(||nanu||)
talabosi sūḍa mŏdalam̐ brakṛti jaḍamu
yĕlamido guṇatraya mela vachchĕnu
malasi yaṁdarigini manasai niluva nelam̐
yila niṁdriyavyābāra memiḍigi

(||nanu||)
prakṛti jaḍamaide bahubhāṣha lu rā nela
agaḍa saṁsārabhoga madi gā nela
pragaḍiṁchi brahmadulabaṭṭamu gānela
sagaladharmādharmasvarūba mĕṭṭāya

(||nanu||)
jaḍamaina prakṛtigi janmabaraṁpara lela
aḍiyālālaṁdu naṁdu nadĕṭṭĕṟim̐gĕ
yĕḍa sŏchchīni preraṇa lanniḍānani yĕṁchide
viḍivi śhrīveṁkaḍeśha nīvu niṣhkriyum̐ḍavu